ఆ ఊర్లో పాదరక్షలు నిషేధం.. నియమం ఉల్లంఘిస్తే చెల్లించాలి భారీ మూల్యం..

by Sumithra |
ఆ ఊర్లో పాదరక్షలు నిషేధం.. నియమం ఉల్లంఘిస్తే చెల్లించాలి భారీ మూల్యం..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : ప్రపంచంలోని ప్రతి వ్యక్తి బయటికి వెళ్లాలంటే కచ్చితంగా చెప్పులో, బూట్లో ధరించిన తరువాతే బయటికి వెళతారు. కొంతమంది ఇంటి లోపల కూడా చెప్పులు ధరించే నడుస్తారు. బయటికి వెల్లినప్పుడు కాలికి ఎలాంటి గాయం కాకుండా, ఏమీ గుచ్చుకోకుండా ఉండేందుకు ఇలా చేస్తుంటారు. అందుకే చెప్పులను పాదరక్షలు అని కూడా అంటారు.

కానీ దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక గ్రామంలో ఓ వింత ఆచారాన్ని ఫాలో అవుతారు. ఆ నియమాన్ని ఉల్లంఘించారంటే భారీ మూల్యం చెల్లించక తప్పదంట. ఇంతకీ ఏంటి అంటారా అక్కడి ప్రజలు ఎప్పుడూ బూట్లు, చెప్పులు ధరించరట. ఇంటి నుంచి బయటికి వెళ్లినా, గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లినా వారు అస్సలు చెప్పులు ధరించరట. అక్కడ షూస్‌, స్లిప్పర్స్‌పై నిషేధం విధించినట్లు చెబుతారు అక్కడి ప్రజలు. దీని వెనుక చాలా ఆసక్తికరమైన కారణం ఉంది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చిన్న గ్రామం పేరు అండమాన్. ఇది తమిళనాడు రాజధాని చెన్నైకి 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం ఆ గ్రామంలో దాదాపు 130 కుటుంబాలు ఉండేవి. చాలా మంది ప్రజలు పొలాల్లో పనిచేసుకునే రైతులు లేదా కూలీలే ఉంటారు.

వీధుల్లో కూడా చెప్పులు ధరించరు..

ఈ గ్రామంలో వేసవి కాలంలో వృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్నవారు మధ్యానం సమయంలో మాత్రమే చెప్పులు, బూట్లు ధరించే అవకాశం కల్పిస్తారట. పిల్లలు కూడా బూట్లు, చెప్పులు వేసుకోకుండానే బడికి వెళ్తుంటారు. నిజానికి ఈ గ్రామాన్ని ముత్యాలమ్మ అనే దేవత కాపాడుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. ప్రజలు ఆమె గౌరవార్థం బూట్లు, చెప్పులు ధరించరు. పాదరక్షలు, చెప్పులు వేసుకుని గుడిలోపలికి ఎలాగైతే వెళ్లరో ఈ గ్రామాన్ని కూడా దేవాలయంలా భావించి, కాళ్లకు చెప్పులు వేసుకోకుండా ఇక్కడ నడుస్తారు. ఈ ఆచారం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఎవరి బలవంతం గానో ఈ ఆచారాన్ని పాటించడం లేదట. కేవలం వారి విశ్వాసాల ప్రకారమే ఈ ఆచారం పాటిస్తారు. ఒకవేళ బయటి నుంచి అతిథి గ్రామానికి వస్తే వారికి ఈ సంప్రదాయం గురించి చెబుతారు. ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటే గ్రామంలోకి అనుమతిస్తారట. అయితే ఏండ్లనాటి నియమాన్ని పాటించకపోతే గ్రామంలో జ్వరం వ్యాపించి మరణానికి దారితీస్తుందని ప్రజలలో ఒక నమ్మకం ఉంది. మార్చి - ఏప్రిల్‌లో గ్రామస్తులు దేవతను పూజిస్తారు. అలాగే 3 రోజుల పాటు పండుగను నిర్వహిస్తారు.

Next Story

Most Viewed