తెలంగాణలో పెరిగిపోతున్న విడాకుల సంఖ్య.. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే..

by Sujitha Rachapalli |
తెలంగాణలో పెరిగిపోతున్న విడాకుల సంఖ్య.. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే..
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య కాలంలో డివోర్స్ రేట్ పెరిగిపోతుంది. సమానత్వం, ఆర్థిక స్థిరత్వం, అమ్మాయిల ఆర్థిక స్వాతంత్ర్యం, స్వేచ్ఛ.. ఇందుకు కారణమని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. పితృస్వామ్య వ్యవస్థ ఆచారాలను భరించలేని స్త్రీలు విడాకులే బెస్ట్ అనే డెసిషన్ కు వస్తున్నారని నిపుణులు అంటున్నారు. ఈ కాలంలోనూ డొమెస్టిక్ వాయిలెన్స్, మెంటల్ టార్చర్ సహించలేకనే పెళ్లి అనే బంధం నుంచి పారిపోతున్నారనే వాదనలు ఉన్నాయి. ఏదేమైనా భారత్ లో విడాకుల సంఖ్య పెరిగిపోతుండగా.. తెలంగాణ టాప్ 7లో ఉండటం విశేషం. మరి మిగతా రాష్ట్రాల గురించి తెలుసుకుందాం.

మహారాష్ట్ర

దేశంలోనే అత్యధికంగా 18.7% విడాకుల రేటుతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.

కర్ణాటక

మహారాష్ట్రను అనుసరిస్తున్న కర్ణాటక డివోర్స్ రేట్ 11.7%గా ఉంది.

వెస్ట్ బెంగాల్

పశ్చిమ బెంగాల్ విడాకుల రేటు 8.2%గా అంచనా వేయబడింది.

ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలో విడాకుల రేటు 7.7% ఉండగా... ఇంకా పెరిగే అవకాశం ఉంది.

తమిళనాడు

సౌత్ స్టేట్ తమిళనాడు ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక్కడ డివోర్స్ రేట్ 7.1% ఉన్నట్లు అంచనా వేయబడింది.

తెలంగాణ

ఇక అత్యధిక విడాకుల సంఖ్య కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా చోటు దక్కించుకుని.. అరో స్థానంలో ఉంది. విడాకుల రేటు 6.7%గా ఉన్నట్లు తేలింది.

కేరళ

కేరళ ప్రస్తుతం ఏడో స్థానంలో కొనసాగుతుండగా.. డివోర్స్ రేట్ 6.3%గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed