- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
C-Section: దక్షిణాదిలో జాతీయ సగటు కంటే రెట్టింపు సిజేరియన్ ప్రసవాలు.. టాప్‌లో తెలంగాణ
దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణాది రాష్ట్రాల్లో సిజేరియన్ డెలివరీ రేట్లు జాతీయ సగటు కంటే రెట్టింపు ఉన్నాయని అంతర్జాతీయ బృందం తెలిపింది. సహజ ప్రసవాల భయంతో పాటు ఒక నిర్దిష్ట తేదీనే బిడ్డను ప్రసవించాలనే కోరిక కారణంగా సిజేరియన్ ప్రసవాలు పెరుగుతున్నాయని కొత్త అధ్యయనం స్పష్టం చేసింది. అమెరికా, స్వీడన్, నార్వే, భారత్‌కు చెందిన పరిశోధకులతో కూడిన అంతర్జాతీయ బృందం నిర్వహించిన ఈ అధ్యయనం పేదలతో పోలిస్తే ధనవంతులలో సిజేరియన్ డెలివరీ రేట్లు రెండింతలు ఉన్నట్లు కనుగొంది. దక్షిణాది రాష్ట్రాల్లో 60.7 శాతం సిజేరియన్ ప్రసవాలతో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడు (44.9 శాతం), ఆంధ్రప్రదేశ్ (42.4 శాతం), కేరళ (38.9 శాతం), కర్ణాటక (31.5 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తూర్పు రాష్ట్రాలు నాగాలాండ్‌లో (5.2 శాతం) అత్యల్పంగా నమోదవగా, ఆ తర్వాత మేఘాలయ (8.2 శాతం), బీహార్ (9.7 శాతం) ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, సిక్కిం మినహా, ఈశాన్య, తూర్పు, మధ్య భారతంలోని రాష్ట్రాలలో సీ-సెక్షన్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదని అధ్యయనంలో తేలింది. సిజేరియన్ డెలివరీలకు సంబంధించి జాతీయ సగటు 21.5 శాతం ఉండగా, జమ్మూ కశ్మీర్ (41.7 శాతం), పంజాబ్ (38.5 శాతం)లలోనూ అధిక సిజేరియన్ కేసులు ఉన్నాయి.
2030 నాటికి అత్యధిక సిజేరియన్ ప్రసవాలు..
ప్రాంతాల్లో వైవిధ్యమే కాకుండా, ఆర్థిక స్థితి, వైద్య సదుపాయాలు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రి.. ఇలా వివిధ అంశాలు ప్రజల ఎంపికను ప్రభావితం చేస్తున్నాయని అధ్యయనం పేర్కొంది. దేశంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో 5.6 శాతం వైద్య కేంద్రాల్లో మాత్రమే 10 శాతం కంటే తక్కువ సిజేరియన్ డెలివరీ రేట్లు ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో భాగంగా సేకరించిన ఈ డేటాలో.. వివిధ రాష్ట్రాల్లో పేద, బలహీన ఆర్థిక నేపథ్యం మూలంగా సీ-సెక్షన్ ఉపయోగంపై అవగాహన, యాక్సెస్ లేకపోవడం వల్ల దాని ప్రయోజనాలను పొందలేకపోతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో 2030 నాటికి దేశంలో అత్యధిక సంఖ్యలో సిజేరియన్ ప్రసవాలు జరుగుతాయని పరిశోధకులు అంచనా వేశారు.
దాదాపు 75 శాతం రాష్ట్రాల్లోని అత్యంత పేద వర్గాల్లో సీ-సెక్షన్ రేటు 10 శాతం కంటే తక్కువగా ఉంది. అయితే అదే సమయంలో 69 శాతం రాష్ట్రాల్లో ధనికుల డెలివరీ రేట్లు పేదల కంటే రెండింతలు ఉన్నాయి. బాగా డబ్బున్న కుటుంబాలలో సాధారణ ప్రసవానికి భయపడటం, మంచిరోజునే ప్రసవం అవ్వాలనే కోరిక, నొప్పి లేని ప్రసవాలు, చిన్న కుటుంబాలకు ప్రాధాన్యత వంటి అంశాలు కూడా ఎక్కువ సిజేరియన్ డెలివరీ రేటుకు దోహదం చేస్తున్నాయని పరిశోధనలో పేర్కొంది.