Direct Tax: 16 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు

by S Gopi |
Direct Tax: 16 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఇప్పటివరకు మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 16.45 శాతం పెరిగి రూ. 15.82 లక్షల కోట్లకు పైగా చేరాయని ఆదాయపు పన్ను విభాగం బుధవారం వెల్లడించింది. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రీఫండ్లకు ముందు రూ. 19.21 లక్షల కోట్లతో రూ. 20.32 శాతం వృద్ధిని సాధించాయి. సమీక్షించిన ఏడాదిలో రీఫండ్లు 42.49 శాతం పెరిగి రూ. 3.38 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం వసూళ్లలో కార్పొరేట్ పన్ను వసూళ్లు రీఫండ్ల తర్వాత రూ. 7.42 లక్షల కోట్లుగా ఉన్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ. 6.83 లక్షల కోట్లు వచ్చినట్టు పన్ను విభాగం తెలిపింది. ప్రధానంగా వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయని గణాంకాలు వెల్లడించాయి. గతేడాది స్థూలంగా రూ. 7.81 లక్షల కోట్లు రాగా, ఈసారి రూ. 9.53 లక్షల కోట్లకు పెరిగాయి.

Advertisement

Next Story

Most Viewed