Vijay Merchant Trophy : క్రికెట్ జట్టులోకి పుల్వామా అమరవీరుడి కుమారుడు

by Sathputhe Rajesh |
Vijay Merchant Trophy : క్రికెట్ జట్టులోకి పుల్వామా అమరవీరుడి కుమారుడు
X

దిశ, స్పోర్ట్స్ : పుల్వామా దాడిలో అమరుడైన సైనికుడు విజయ్ సోరెంగ్ కుమారుడు రాహుల్ సోరెంగ్ హర్యానా తరఫున అండర్-16 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. రాహుల్ సెహ్వాగ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో 2019 నుంచి విద్యనభ్యసించాడు. పుల్వామా దాడి తర్వాత అమరులైన సైనికుల పిల్లలకు సెహ్వాగ్ ఉచిత విద్యతో పాటు హాస్టల్ వసతిని కల్పించాడు. రాహుల్ విజయ్ మర్చంట్ ట్రోఫీకి ఎంపిక అవడం పట్ల భారత క్రికెట్ దిగ్గజం సెహ్వాగ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించాడు. ‘నా జీవితంలో ఇది మరచిపోలేని రోజు. పుల్వామా హీరో షహీద్ విజయ్ సోరెంగ్ కుమారుడు రాహుల్ సోరెంగ్ సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 2019 లో జాయిన్ అయ్యాడు. నాలుగేళ్ల పాటు ఇదే పాఠశాలలో విద్యనభ్యసించాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్-16 హర్యానా జట్టుకు రాహుల్ ఎంపికయ్యాడు. కొన్ని విషయాలు మనసుకు ఎంతో సంతోషాన్నిస్తాయి. మన వీర జవాన్లకు కృతజ్ఞతలు’ అని సెహ్వాగ్ పోస్ట్ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed