PKL 11: ప్లే ఆఫ్స్‌కు పాట్నా పైరెట్స్.. తెలుగు టైటాన్స్‌పై 41-37తేడాతో విజయం

by Sathputhe Rajesh |
PKL 11: ప్లే ఆఫ్స్‌కు పాట్నా పైరెట్స్.. తెలుగు టైటాన్స్‌పై 41-37తేడాతో విజయం
X

దిశ, స్పోర్ట్స్ : ప్రోకబడ్డీ లీగ్(పీకేఎల్) 11 వ సీజన్‌లో పాట్నా పైరెట్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. బుధవారం పూణే బలేవాడిలోని బ్యాడ్మింటన్ హాల్‌లో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌పై పాట్నా 41-37తేడాతో గెలుపొందింది. పాట్నా జట్టులో దేవాంక్ దలాల్ 14 పాయింట్లు సాధించాడు. తద్వారా మ్యాచ్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ విజయంతో పాట్నా పైరెట్స్ 69 పాయింట్లతో యూపీ యోధాస్‌తో కలిపి పాయింట్ల పట్టి్కలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. దబాంగ్ ఢిల్లీ 71 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత రెండు జట్లు 10-10తో స్కోరును సమం చేశాయి. అయితే ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి పాట్నా పైరెట్స్ 19-18తో ఆధిక్యంలో నిలిచింది. ఆటకు పది నిమిషాలు ఉండగా తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు పవన్ షెరావత్, విజయ్ మాలిక్, అశిష్ నర్వాల్ వీరోచితంగా పోరాడటంతో స్కోరు 32-29కి చేరింది. పాట్నా పైరెట్స్ సమిష్టిగా రాణించడంతో 41-37తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో యూపీ యోధాస్ సైతం ప్లేఆఫ్‌కు చేరుకుంది. హర్యానా స్టీలర్స్, ఢిల్లీ కే.సీ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed