- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ICC Rankings : టీ20ల్లో నెం.1 బౌలర్‌గా అకీల్ హుస్సేన్.. ఏడాది తర్వాత అదిల్ రషీద్‌కు బిగ్ షాక్
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ స్పిన్ బౌలర్ అకీల్ హుస్సేన్ నెంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అకీల్ 13 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ గతేడాది డిసెంబర్ 14 నుంచి నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుండగా అతన్ని వెనక్కి నెట్టి అకీల్ ఈ ఘనత సాధించాడు. భారత స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ 666 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ 8వ స్థానంలో నిలిచాడు. టీ20 ఆల్ రౌండర్ల జాబితాలో 244 పాయింట్లతో హార్ధిక్ పాండ్యా టాప్‌లో నిలిచాడు.
టెస్టుల్లో మళ్లీ జో రూటే నెం.1
తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 895 పాయింట్లతో ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ నెం.1గా నిలిచాడు. గత వారం బ్రూక్ నెంబర్ వన్‌గా నిలవగా రూట్ తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత బ్యాట్స్‌మెన్లలో జైస్వాల్(4), పంత్(9) ర్యాంకులతో టాప్-10 జాబితాలో కొనసాగుతున్నారు. టెస్ట్ బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా 890 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బుధవారం రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్పిన్ బౌలర్ అశ్విన్ 797 పాయింట్లతో ఐదో స్థానంలో, జడేజా ఆరో స్థానంలో కొనసాగుతున్నారు. టెస్ట్ ఆల్ రౌండర్ల జాబితాలో జడేజా 415 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో అశ్విన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.