INS nirdeshak: ఐఎన్ఎస్ నిర్దేశక్ జల ప్రవేశం.. ప్రత్యేకతలివే?

by vinod kumar |
INS nirdeshak: ఐఎన్ఎస్ నిర్దేశక్ జల ప్రవేశం.. ప్రత్యేకతలివే?
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత నౌకాదళం కోసం నిర్మించిన ‘ఐఎన్ఎస్ నిర్దేశక్’ (Ins nirdeshak) నౌక జలప్రవేశం చేసింది. విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డ్‌లో తూర్పు నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ (Sanjay seth) దీనిని జాతికి అంకితం చేశారు. ఇతర నేవీ సీనియర్ అధికారులు సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఐఎన్ఎస్ నిర్దేశక్‌ను ప్రధానంగా హైడ్రోగ్రాఫిక్ సర్వేలు, నావిగేషన్ ఎయిడ్స్, సముద్ర కార్యకలాపాలలో సహాయం చేయడానికి రూపొందించారు. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (GRSE) నిర్మించిన ఈ నౌక సర్వే వెసెల్ (లార్జ్) ప్రాజెక్ట్‌లో రెండో నౌక కావడం గమనార్హం. 32 ఏళ్ల పాటు సేవలందించి 2014లో ఉపసంహరించబడిన నిర్దేశక్‌ వారసుడిగా దీనిని భావిస్తున్నారు.

80 శాతం స్వదేశీ పరిజ్ఞానం

ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక పొడవు110 మీటర్లు కాగా.. 3800 టన్నుల బరువు ఉంటుంది. సమర్థవంతమైన పనితీరు నిమిత్తం దీనిలో రెండు ఇంజన్లను అమర్చారు. 80శాతం స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని తయారు చేశారు. డేటా సేకరణ వ్యవస్థ, అటానమస్ అండర్ వాటర్ వెహికల్, లాంగ్-రేంజ్ పొజిషనింగ్ సిస్టమ్‌లతో సహా హైడ్రోగ్రాఫిక్, ఓషనోగ్రాఫిక్ సర్వేల కోసం అత్యాధునిక సాంకేతికతతో రూపొందించారు. సముద్రంలో 25 రోజులకు పైగా నౌక పని చేయగలదు, 18 నాటికల్ మైళ్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించడం, విస్తృతమైన సర్వేలు, నిరంతర కార్యకలాపాలు నిర్వహించగలిగే సామర్థ్యం దీనికి ఉంది. కాగా, దీనిని 2020 డిసెంబర్ 1 నుంచి తయారు చేయడం ప్రారంభించగా 2022లో ట్రయల్స్ పూర్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed