మీడియాపై జిల్లా వైద్య అధికారికి ఎందుకంత చిన్నచూపు..?

by Aamani |
మీడియాపై జిల్లా వైద్య అధికారికి ఎందుకంత చిన్నచూపు..?
X

దిశ,మేడిపల్లి : మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండల మీడియా అంటే మేడ్చల్ జిల్లా వైద్య అధికారికి ఎందుకంత చిన్న చూపో తెలియదు. మండలంలో వైద్య కార్యక్రమాలకు హజరయ్యెటప్పుడు సమాచారమే ఉండదు. మీడియాకు సమాచారం ఇవ్వండని ఎన్ని సార్లు మోర పెట్టుకున్న వేడి పెనం మీద నీళ్లు చల్లి నట్లు వ్యవహరిస్తున్నారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎప్పుడో రాత్రికి పంపిస్తె పంపిస్తారు, లేకుంటే లేదు. కొన్ని కార్యక్రమాల వివరాలు తెలియవు. ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతారో కూడా తెలియదు. దీంతో మండలంలో ప్రజలు వైద్యపరంగా ఎంతో సమాచారం మిస్సవుతున్నారు. ఈ నెల 12 న బోడుప్పల్ లో యూ పీ హెచ్ సి ప్రారంభించారు. జిల్లా వైద్య అదికారి హజరయ్యారు.కానీ మీడియాకు సమాచారం లేదు, కనీసం ఫోటో కూడా పెట్టలేదు.మండలంలో 4 యూపీహెచ్ లు 4 బస్తీ దావఖానాలు, ఉన్నాయి. వాటి గురించి ప్రజలకు కనీస అవగాహన కూడా కల్పించారు.

అన్నీ తానైన వైద్య అధికారి పీఎ...

ఎదైన సమాచారం అడుగుదామని ఫోన్ చేస్తే పిఎ మాట్లాడుతారు. పిఎ తానె జిల్లా వైద్య అధికారి అనుకుంటూ మాట్లాడుతారు. అసలు వైద్య అధికారి పిఎ నా లేక రఘనాథ్ స్వామి నా అన్నట్లు వ్యవహరిస్తారు. ఇప్పటికే ఎవరనేది కొత్త వారికి అర్థం కాదు. వైద్య అధికారిని ఏమి అడిగినా తానె జవాబు ఇస్తాడు. వైద్య అధికారి నోరు మెదపరు.పీఎకు , జిల్లా అధికారికి వ్యత్యాసం చూపించాలని ప్రజలు కోరుతున్నారు.

కార్పొరేట్ ఆస్పత్రిలో జరిగిన అరాచకానికి వివరణ ఎక్కడ..?మీడియాపై

పీర్జాదిగూడలో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ చిన్నారి చేతి వేళ్ళు ఇన్ఫెక్షన్ అయి బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేయగా జిల్లా వైద్య అధికారి దీనిపై విచారణ అధికారులను నియమించి విచారణ జరిపించారు. కానీ ఆ విచారణ ఇప్పటికే ఎక్కడి వరకు వచ్చింది సమాచారం లేదు. సిబ్బంది తప్పిదమా, సహజంగానే అలా జరిగిందా , తప్పె జరిగితే ఏ విధమైన చర్యలు తీసుకున్నారనేది ఇప్పటి వరకు లోకల్ మీడియాకు తెలియదు. విశ్వసనీయ సమాచారం మేరకు వారి సిబ్బంది ముందుండి అన్ని చక్కబెట్టాలని ప్రజలు భావిస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పెట్టమంటే మా వెనుక పెద్దమనుషులు లేకుండా ఉంటారా అంటూ దర్జాగా కార్పోరెట్ దీమాతో ఉన్నారు. ఇంతకి వైద్య అధికారి తన ధోరణి మార్చుకొని జిల్లాలో అన్ని మండలాలకు కూడా తానే వైద్య అధికారిని అన్న సంగతి గుర్తు చేసుకుని మేడిపల్లి మండలం లో కూడా ముందస్తు సమాచారం, అలానె కార్పొరేట్ హాస్పిటల్ లో జరిగిన విచారణ మీడియాకు తెలియజేయాలని ప్రజలు, మీడియా కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed