ఫాంహౌస్ దాటని కేసీఆర్.. డైలామాలో బీఆర్ఎస్ కేడర్

by karthikeya |
ఫాంహౌస్ దాటని కేసీఆర్.. డైలామాలో బీఆర్ఎస్ కేడర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదు. రేపు వస్తారు.. ఎల్లుండి వస్తారు.. ఫలానా రోజు వస్తారు.. అంటూ ప్రచారం జరుగుతున్నా ఇంతవరకు ఆయన ఫాంహౌస్‌ను వదిలి బయటకు వచ్చింది లేదు. పార్టీ కార్యాలయానికి ప్రతీవారం వస్తానని గతంలో చెప్పినప్పటికీ ఇంతవరకు రాలేదు. కేడర్‌కు అందుబాటులోకి రాలేదు. దీంతో పార్టీలో ఏం జరుగుతోందో అర్థం కాక కేడర్ అయోమయంలో పడింది. తాజాగా రాష్ట్ర కేబినెట్‌లో ప్రభుత్వం తీసుకునే పాలసీలను చూసి పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి పార్టీ భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఇప్పుడైనా వస్తారా..? లేక ప్రకటనకే పరిమితం అవుతుందా..? అనేది హాట్‌టాపిక్‌గా మారింది.

ఇప్పుడే ప్రజల్లోకి వద్దనుకుంటున్నారా..?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఒకరో జు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. అక్క డి నుంచి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌ కు వచ్చి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇంతవరకు మళ్లీ భవన్‌ కు రాలేదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని పార్టీ కేడర్‌తోపాటు ప్రజలు సైతం భావించినప్పటికీ దూరం గానే ఉన్నారు. రాష్ట్రంలో వరదల సమయంలోనూ ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేయకపోవడంతో కొంత విమర్శలు వచ్చాయి. మరోవైపు పార్టీ కేడర్‌కు సైతం అందుబాటులో లేకపోవడంతో వారిలో నైరాశ్యం మరింత నెలకొంది. పార్టీ కేంద్ర కార్యాలయానికి వారా నికి రెండుసార్లు వస్తానని, కేడర్‌ను కలుస్తానని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికలు రూపొందిస్తారనే ప్రచారం జరిగింది. కా నీ.. ఇప్పటివరకు అలాంటిది ఏమీ లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు సైతం స్తంభించిపోయాయి. మరోవైపు కేసీఆర్ ఇప్పటి నుంచే ప్రజ ల్లోకి వచ్చినా లాభం ఉండదని, ప్రజలకు ప్రభు త్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడే వారి మధ్యలోకి వెళ్తే బాగుంటుంది అని భావిస్తున్నారా..? డైలామాలో పడటంతోనే భవన్‌కు రావడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్ర కేబినెట్ తర్వాత భవన్‌కు?

ఈ నెల 20న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే.. ఆ సమావేశంలో ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకునే అంశాలు, ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వైఫల్యాలపై కార్యాచరణ చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమా చారం. కేబినెట్ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీతో సమావేశం నిర్వ హించి వారికి పార్టీ కార్యాచరణ వివరించనున్నట్లు పార్టీ వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. అయితే తేదీపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇంతకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పోరాటం చేస్తారా? లేకుంటే ఇంకా వేచిచూసే ధోరణి అవలంబిస్తారా? అనేది కూడా కేడర్‌లో చర్చనీయాంశమైంది.

వరుస మీటింగ్‌లకు ప్లాన్?

తెలంగాణ భవన్ వేదికగా వరుస మీటింగ్‌లకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల వారీగానా లేకుంటే పార్లమెంట్ వారీగా నిర్వహిస్తారా? అనే దానిపై మాత్రం గోప్యంగా ఉం చుతున్నారు. పార్టీ రోజురోజుకూ బలహీన పడుతుండటంతోనే సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే ఫీడ్ బ్యాక్ తీసుకొని పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. రెండునెలల క్రితం ఫామ్‌హౌస్‌లో సుమారు పది అసెంబ్లీ ని యోజకవర్గాల నేతలతో వరుస సమీక్షలు నిర్వహించి ఫుల్ స్టాప్ పెట్టారు. తిరిగి సెగ్మెంట్లవారీగా భవన్‌లో నిర్వహిస్తారని సమాచారం.

రోజురోజుకూ నిరాశలో కేడర్

ప్రజాసమస్యలపై పార్టీ కార్యాచరణ ప్రకటించలేదు. కేడర్‌లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. అసలు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉందా? లేదా? అనే అనుమానం కేడర్‌లో కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం అని చెబుతున్నప్పటికీ పార్టీ పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడటం లేదు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పక్షాన పోరాడేందుకు కార్యక్రమాలను అధిష్టానం ఇవ్వలేదు. దీంతో పార్టీ అధిష్టానం ఏం చేయాలనుకుంటున్నదో తెలియక కేడర్ సతమతమవుతోంది.

Advertisement

Next Story