Adani: అదానీ లంచం ఆరోపణలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

by S Gopi |
Adani: అదానీ లంచం ఆరోపణలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: బిలియన్ డాలర్ల కాంట్రాక్టులను దక్కించుకునేందుకు ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణలపై పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తదితరులపై అమెరికా కోర్టు ఆరోపణల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. దీనికి సంబంధించి దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన దరఖాస్తులో.. గౌతమ్ అదానీతో పాటు అదానీ గ్రూప్‌లోని ఇతర సీనియర్ నేతలపై అమెరికా మోపిన లంచం ఆరోపణలపై భారత అధికారులచే విచారణ జరిపించాలని కోరారు. ఇదే సమయంలో 2023 హిండెన్‌బర్గ్ నివేదికలో మోపబడిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి గతంలో మొత్తం 24 పరిశీలనలో 22 పూర్తయ్యాయని తన నివేదికను సమర్పించింది. ఆ తర్వాత దర్యాప్తు నివేదికను సమర్పించలేదని, ఇది సెబీపై విశ్వాసాన్ని తగ్గిస్తుందని న్యాయవాది వివరించారు. తాజాగా అమెరికా కోర్టు ఆరోపణలు తీవ్రమైనవిగా నిర్ధారణ అయ్యాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా, న్యాయ ప్రయోజనాలను కాపాడేందుకు భారత ఏజెన్సీలు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 'సెబీ దర్యాప్తులను ముగించి, నివేదికను రికార్డుల్లో చేర్చి విశ్వాసాన్ని పెంపొందించాలి. సెబీ దర్యాప్తులో షార్ట్ సెల్లింగ్ ఆరోపణలు ఉన్నందున విదేశీ అధికారులు లేవనెత్తిన ప్రస్తుత ఆరోపణలకు సంబంధం ఉండచ్చు లేదా లేకపోవచ్చు. అయితే, సెబీ దర్యాప్తును పూర్తి చేయడం ద్వారానే దీనిపై స్పష్టత వస్తుంది. తద్వారా ఇన్వెస్టర్లు విశ్వాసం కోల్పోకుండా ఉంటారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story