- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది.. మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్
దిశ, తెలంగాణ బ్యూరో: ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను హత్యచేసిందని మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం వాజ్ పేయ్ జయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవం పేరిటి నిర్వహించిన సభలో మాట్లాడారు. వాజ్‌పేయ్, పీవీ నరసింహారావుతో ఉన్న పరస్పర గౌరవం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. తమ పార్టీ కూడా నరసింహారావును గౌరవించిందని గుర్తు చేశారు. అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వకుండా కాంగ్రెస్ అడ్డుకుంటే తాము గౌరవించుకున్నట్లు గుర్తు చేశారు.
ఇప్పటికీ అధికార, విపక్షాల సీనియర్ నాయకులు.. వాజ్‌పేయ్‌ను గౌరవించేందుకు కారణం ఆయన వ్యక్తిత్వమేనని కొనియాడారు. కార్గిల్ యుద్ధంలో ఎక్కువ త్యాగాలు చేసింది హిమాచల్ ప్రదేశ్ సైనికులేనని, నలుగురికి పరమవీర చక్ర అవార్డులు వస్తే అందులో ఇద్దరు తమ హిమాచల్ వారేనని పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో మోడీ కార్గిల్‌కు వెళ్లినపుడు సైనికులు భారత్ మాతాకీ జై, వాజ్‌పేయ్‌కి జై అని నినాదాలు చేసినప్పుడు ఆశ్చర్యపోయారని అన్నారు. అందుకు కారణం యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు ఒత్తిడి చేస్తే.. వాజ్‌పేయ్ వెనక్కు తగ్గేది లేదని, తన భూభాగాన్ని ఒక్క ఇంచు కూడా వదిలేది లేదని స్పష్టంచేసిన ధీశాలి అంటూ కొనియాడారు.
ఇది సైనికుల్లో ఎంతో స్థైర్యాన్ని నింపిందని అన్నారు. గతంలో విదేశీయులు భారతీయులను బిచ్చగాళ్లు, పాములు పట్టుకునే వాళ్లని అవహేళన చేశారని, ఇది చాలా బాధగా అనిపించేదని అనురాగ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. కానీ, వాజ్‌పేయ్ నేతృత్వంలో ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చి భారతదేశం అణ్వస్త్ర దేశంగా గుర్తింపు పొంది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని గుర్తు చేశారు. 370 ఆర్టికల్ రద్దును బీజేపీ అగ్ర నేతలు శ్యా్మ్‌ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వాజ్‌పేయ్ సంకల్పిస్తే.. మోడీ దాన్ని పూర్తి చేశారని అన్నారు. వాజ్‌పేయ్ వ్యక్తి కాదని.. దేశ వ్యవస్థ అంటూ అనురాగ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు.