- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమాదకరంగా మారిన శంకర్ పల్లి- గండిపేట రహదారి
దిశ, శంకర్ పల్లి: హైదరాబాద్ రోడ్లు -భవనాల శాఖ అధికారుల నిర్వాకం.. నిర్లక్ష్యం ఏమో కానీ గండి పేట- శంకర్ పల్లి రహదారిపై వంతెన నిర్మించారు. దానికి గోడ నిర్మించేందుకు ఇనుప చువ్వలు బిగించారు.. గోడ నిర్మించడం మరిచారు.. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎనిమిది సంవత్సరాల క్రితం గండిపేట నుండి శంకర్పల్లి వరకు నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టారు. శంకర్ పల్లి మండలం ( ప్రస్తుతం నార్సింగ్ మున్సిపల్ పరిధిలోకి మారింది) మిర్జాగూడ అనుబంధ గ్రామమైన మియా ఖాన్ గడ్డ బస్ స్టేజీకి సమీపంలోనే రోడ్డు విస్తరణ కోసం వంతెనను వెడల్పు చేశారు.
ఈ క్రమంలో సైడ్ వాల్ నిర్మించేందుకు ఇనుప చువ్వలతో బిగించి సిమెంట్ గోడ నిర్మించకుండా వదిలేశారు. ఈ వంతెన కింద నుంచి ఫిరంగి కాలువ వెళ్తుంది. వర్షాకాలంలో వర్షాలు కురిసిన సమయంలో వర్షపు నీరు ఈ వంతెన కింది నుంచి నీరు ప్రవహిస్తుంది. ప్రతి రోజూ వందలాది వాహనాలు నగరం నుంచి నార్సింగ్, గండిపేట్ కోకాపేట్ మీదుగా, ఇంద్రా రెడ్డి నగర్, ప్రొద్దుటూరు మీదుగా ప్రగతి రిసార్ట్, శంకర్ పల్లి, మోమిన్ పేట్, మర్ పల్లి, బంటారం, పంచలింగాల్, ఎన్కేపల్లి మీదుగా వికారాబా ద్ కు ప్రతినిత్యం ఆర్టీసీ బస్సు లతోపాటు లారీలు, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు వెళ్తుంటాయి. వాహనాలు ఓవర్టేక్ చేసే క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్ రాష్ట్ర సమితి అధికారంలో ఉండగా అప్పటి రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి హయాంలో ఈ రహదారి వెడల్పు కార్యక్రమం చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు ఈ రహదారిపై ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులంతా వెళ్లేవారు. శంకరపల్లి వైపు వస్తుంటే ఎడమవైపు కాగా వంతెనకు కుడి వైపు భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఫామ్ హౌస్ వ్యవహారం కూడా పెద్ద దుమారం ఇక్కడే జరిగింది. ఇంత జరిగినా ఎవరు కూడా ఈ వంతెన వైపు తొంగి చూడలేదు. రోడ్లు భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్య మా? వంతెనకు గోడ నిర్మించకుండానే బిల్లులు లేపారా? గోడ నిర్మించకుండా ఎందుకు వదిలేశారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులు ప్రమాదాలు జరగకముందే మేల్కొని గోడ నిర్మాణం చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రమాదాలు జరగకముందే స్పందించాలి..
గండిపేట- శంకర్ పల్లి మెయిన్ రోడ్డు పై నాలుగు లైన్ల విస్తరణలో వంతెనకు ఎడమవైపు సైడ్ వాల్ నిర్మించకుండా నే వదిలేశారు. ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యమో ఏమోగానీ సైడ్ వాల్ నిర్మించకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నిత్యం వందలాది వాహనాలు ఈ రహదారిపై వెళ్తుంటాయి. రాత్రిపూట వాహనదారులు ఆదమరిచి ప్రయాణం చేస్తే ఏదైనా ప్రమాదం జరగవచ్చు. కాబట్టి సంబంధిత అధికారులు స్పందించి సైడ్ వాల్ నిర్మించాలి. :- బీర్ల శివ, మాజీ వార్డు మెంబర్, జనవాడ