- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వీట్లలో స్క్రబ్బర్ తీగల కలకలం
దిశ, కామారెడ్డి టౌన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఢిల్లీవాలా స్వీట్ హోంలో డిషెస్ క్లీన్ చేసే స్క్రబ్బర్ తీగలు కనిపించాయి. పట్టణానికి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి అరకిలో ఖాజు కట్లీ స్వీట్ తీసుకుని ఇంటికి వెళ్లి చూడగా..స్వీట్లో స్క్రబ్బర్ తీగలు బయటపడ్డాయి. పిల్లలు చూసుకోకుండా తిని ఉంటే పరిస్థితి ఏమిటని వాపోయాడు. నిర్లక్ష్యంగా స్వీట్స్ విక్రయిస్తున్న ఢిల్లీ వాలా స్వీట్ హోంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పట్టణంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేపట్టడం లేదని చాలాసార్లు బేకరీలో, స్వీట్ షాపుల్లో స్వీట్లు కుళ్ళిపోతున్న పట్టించుకోవడంలేదని, స్వీట్ హోమ్ యజమానులు ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారని ఫుడ్ ఇన్స్పెక్టర్ శిరీష కు ఫిర్యాదు చేస్తే..నామమాత్రంగా తనిఖీలు చేసి రిపోర్టర్ రావడానికి చాలా టైం పడుతుందని చేతులు దులుపుకుంటున్నారన్నారు. పట్టణంలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్న తనిఖీలు చేయకపోవడం ద్వారానే ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి స్వీట్స్ షాపులను, బేకరీలను వెంటనే మూసివేయాలని షాపులను తనిఖీ చేయడంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు.