Manmohan Singh: నేను మౌన ప్రధానిని కాదు.. ఆ విషయం పుస్తకమే చెబుతోంది- మన్మోహన్ సింగ్

by Shamantha N |
Manmohan Singh: నేను మౌన ప్రధానిని కాదు.. ఆ విషయం పుస్తకమే చెబుతోంది- మన్మోహన్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: దశాబ్ద కాలంపాటు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్(Manmohan Singh) తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. కాగా.. ఆయన్ని అందరూ “మౌన ముని”(Silent PM) అని తరచూ విమర్శలు గుప్పించారు. కాగా.. 2018లో 'ఛేంజింగ్ ఇండియా'(Changing India) పుస్తకం విడుదల సందర్భంగా మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తానేంటో ఆ పుస్తకమే చెబుతోందని అన్నారు. అందులో ఆర్థికవేత్తగా తన కెరీర్ పై ఆలోచనలను వివరించారు. “నేను మీడియాతో మాట్లాడేందుకు భయపడే ప్రధానమంత్రిని కాదు. నేను క్రమం తప్పకుండా మీడియాను కలుస్తాను. నా ప్రతి విదేశీ పర్యటనలో ప్రెస్ కాన్ఫరెన్స్ ని నిర్వహించారు. విదేశాల నుంచి తిరిగి వచ్చినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ చాలానే ఉన్నాయి. వాటి ఫలితాలను కూడా పుస్తకాలను వివరించాను" అని మన్మోహన్ సింగ్ అన్నారు.

మన్మోహన్ సింగ్ నిర్ణయాలు

ఇకపోతే, ఎక్కడా పెద్దగా మాట్లాడకుండానే 2004 నుంచి 2014 వరకు ప్రధాని మన్మోహన్ సింగ్ దేశాన్ని సమర్థంగా ముందుకు నడిపించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు, ఉపాధి హామీ పథకం ప్రారంభం వంటి ఎన్నో కీలక పరిణామాలు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే జరిగాయి. మన్మోహన్‌ సింగ్‌ పాలనా కాలంలోనే దేశంలో 3జీ, 4జీ సేవల ప్రారంభంతో మొబైల్‌ సాంకేతిక విప్లవానికి నాంది పడింది. అంతేకాకుండా గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పనికి గ్యారెంటీ కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. వివిధ పథకాల కింద నగదు సాయాన్ని ఆధార్‌ అనుసంధానమైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసే (DBT) ప్రక్రియను ప్రారంభించింది. ప్రైవేటు పాఠశాలల్లోనూ కొందరు పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు రూపొందించింది.

Advertisement

Next Story

Most Viewed