- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PKL 2024 : ఫైనల్‌కు చేరుకున్న హర్యానా, పాట్నా
దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఫైనల్‌లో హర్యానా స్టీలర్స్, పాట్నా పైరేట్స్ తలపడనున్నాయి. పుణెలో శుక్రవారం జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో దబాంగ్ ఢిల్లీ కే.సీపై పాట్నా, యూపీ యోధాస్‌పై హర్యానా విజయాలు నమోదు చేశాయి. ముందుగా తొలి సెమీస్‌లో హర్యానా 28-25 తేడాతో యూపీపై గెలుపొందింది. మొదటి నుంచి చివరి వరకూ ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఇరు జట్లు పాయింట్ల కోసం పోటీపడ్డాయి. అయితే, హర్యానా స్వల్ప ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వస్తూ ప్రత్యర్థిని కట్టడి చేసింది. రైడర్లు శివమ్ 7 పాయింట్లు, వినయ్(6), డిఫెండర్ రాహుల్(5) హర్యానా విజయంలో కీలక పాత్ర పోషించారు. మరో సెమీస్‌లో ఢిల్లీని 28-32 తేడాతో పాట్నా ఓడించింది. ఫస్టాఫ్‌లో పాట్నా 17-10తో ఆధిక్యం సాధించడం ఆ జట్టుకు కలిసొచ్చింది. సెకండాఫ్‌లో ఢిల్లీ పుంజుకున్నప్పటికీ ఆధిక్యాన్ని కాపాడుకుంది. హర్యానా వరుసగా రెండోసారి ఫైనల్‌లో అడుగుపెట్టగా.. టైటిల్ పోరుకు అర్హత సాధించడం మాజీ చాంపియన్ పాట్నాకు ఇది ఐదోసారి. హర్యానా తొలి టైటిల్ నిరీక్షణకు ఈ సారైనా తెరదించుతుందో లేదో చూడాలి. మరోవైపు, మూడుసార్లు విజేతగా నిలిచిన పాట్నా మరోసారి చాంపియన్‌గా నిలవడానికి ఉవ్విళ్లూరుతున్నది. ఆదివారం ఫైనల్ జరగనుంది.
- Tags
- #PKL 2024