జవాన్లకు తృటిలో తప్పిన ముప్పు..

by Aamani |
జవాన్లకు తృటిలో తప్పిన ముప్పు..
X

దిశ, భద్రాచలం : భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన 20 కేజీల అతిపెద్ద రెండు ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు గుర్తించారు. నిర్వీర్యం చేయడం తో పెను ముప్పు తప్పింది. సుక్మా (ఛత్తీస్‌గఢ్)జిల్లా, పోలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డోర్నపాల్ నుండి జాగరగుండ వెళ్లే రహదారికి సమీపంలో మావోయిస్టులు అమర్చిన 20 కిలోల 2 ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు గుర్తించారు.వెంటనే స్వాధీనం చేసుకుని వాటిని నిర్వీర్యం చేశారు. అంత పెద్ద ఎత్తున ఐఈడీ విస్ఫోటనం చెందితే భద్రతా బలగాలకు ప్రాణ హాని పెద్ద ఎత్తున జరిగేది.

Advertisement

Next Story

Most Viewed