- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదు వికెట్లు తీసిన మిలింద్.. హైదరాబాద్ గెలుపు బాట
దిశ, స్పోర్ట్స్ : విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు పుంజుకుంది. వరుసగా రెండు ఓటముల తర్వాత తిరిగి గెలుపు బాట పట్టింది. అహ్మదాబాద్‌లో జరిగిన 4వ రౌండ్ మ్యాచ్‌లో పుదుచ్చేరిపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్ మిలింద్(5/13) ఐదు వికెట్లతో చెలరేగడంతో పుదుచ్చేరి బ్యాటర్లు తేలిపోయారు. మిలింద్‌తోపాటు త్యాగరాజన్ కూడా మూడు వికెట్లతో సత్తాచాటాడు. దీంతో పుదుచ్చేరి 31.4 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌటైంది. సంతోశ్ రత్నపర్కె(26) టాప్ స్కోరర్. అయితే, స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి హైదరాబాద్ కూడా కష్టపడింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హిమతేజ(42 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టోర్నీలో హైదరాబాద్‌కు ఇది రెండో గెలుపు.
ఆంధ్ర జోరు
ఆంధ్ర జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. నవీ ముంబైలో జరిగిన మ్యాచ్‌లో సర్వీసెస్ జట్టుపై 10 వికెట్ల తేడా నెగ్గింది. ముందుగా సర్వీసెస్ జట్టు 36.2 ఓవర్లలో 162 పరుగులు చేసి కుప్పకూలింది. అర్జున్ శర్మ(39) పర్వాలేదనిపించాడు. ఆంధ్ర బౌలర్ పిన్నిటి తపస్వి(4/28) సత్తాచాటాడు. ఇక, 163 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 28.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు కెప్టెన్ శ్రీకర్ భరత్(86 నాటౌట్), అశ్విన్ హెబ్బర్(66 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించారు.