'భారత రాణి' చెస్ బోర్డును శాసించారు: ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

by srinivas |
భారత రాణి చెస్ బోర్డును శాసించారు: ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: ఒక 'భారత రాణి' చెస్ బోర్డును కోనేరు హంపి(Koneru Humpy) శాసించారని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Businessman Anand Mahindra) ప్రశంసలు కురిపించారు. 2024 ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌(2024 FIDE Women World Rapid Champion)గా కోనేరు హంపీ కిరీటాన్ని కైవసం చేసుకోవడంపై ఆయన అభినందించారు. ‘‘ కోనేరు హంపి తన అద్భుతమైన ఆట తీరుతో మమ్మల్ని ఎంతో గర్వించేలా చేశారు. భారత చెస్‌కు అద్భుతమైన సంవత్సరంగా నిలిచిన ఈ ఏడాదికి విజయవంతమైన ముగింపును అందించారు. ఇందుకు హంపికి కృతజ్ఞతలు!” అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

Advertisement

Next Story