Manipur: మణిపూర్‌లో మహిళలు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ.. 20 మందికి గాయాలు

by vinod kumar |
Manipur: మణిపూర్‌లో మహిళలు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ.. 20 మందికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌(Manipur)లో మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్‌పోక్పి జిల్లా(Kangpokpi) లో కుకీ-జో కమ్యూనిటీకి చెందిన మహిళలు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ జరిగింది. ఇంఫాల్ ఈస్ట్‌లోని సినామ్ కోమ్ గ్రామాన్ని లక్ష్యంగా చేసుకుని జిల్లాలోని కొండలపై నుంచి సాయుధ వ్యక్తులు కాల్పులు జరిపిన తర్వాత కేంద్ర బలగాలు ఇంఫాల్ ఈస్ట్, కాంగ్‌పోక్పి జిల్లాల్లో పలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. భద్రతా బలగాలను నియంత్రించడానికి మహిళా నిరసనకారులు ప్రయత్నించారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే 20 మంది మహిళలు గాయపడ్డట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మహిళా సంఘాలు నిరసన తెలిపాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కుకీ మహిళలను భద్రతా బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయని కుకీ ఉమెన్స్ రైట్స్ ఆర్గనైజేషన్ (KWOHR) ఆరోపించింది. ప్రస్తుతం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతా బలగాలను ఆ ప్రాంతంలో మోహరించినట్టు మణిపూర్ పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed