- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Supreme court: ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టాలి.. యూజీసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
దిశ, నేషనల్ బ్యూరో: కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష సున్నితమైన అంశమని సుప్రీంకోర్టు (Supreme court) అభివర్ణించింది. దీనిని అరికట్టేందుకు సమర్థవంతమైన యంత్రాంగాన్ని రూపొందించాలని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర, ప్రయివేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో విద్యార్థులపై కుల వివక్షను రూపుమాపేందుకు ముసాయిదాను సిద్ధం చేయాలని జస్టిస్ సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC)ని ఆదేశించింది. ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వాన్ని పెంపొందించేందుకు రూపొందించిన 2012 రూల్స్ ప్రకారం.. ఎన్ని ఈక్వల్ అపార్చునిటీ యూనిట్స్ స్థాపించారో డేటా అందజేయాలని తెలిపింది. ఈ సున్నితమైన సమస్యపై మాకు పూర్తి అవగాహన ఉందని పేర్కొంది. దీనిపై ఏదో ఒకటి చేస్తామని, సమర్థవంతమైన యంత్రాంగాన్ని తీసుకొస్తామని స్పష్టం చేసింది.
ఈ అంశంపై కేంద్రం నుంచి స్పందన కోరిన సుప్రీంకోర్టు.. అన్ని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షకు సంబంధించిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యల గురించి ఆరు వారాల్లోగా సమాచారం అందించాలని యూజీసీని ఆదేశించింది. ఈ అంశంపై 2019లోనే పిల్ దాఖలైందని, కానీ ఇప్పటి వరకు సరైన విచారణ జరగలేదని ధర్మాసనం తెలిపింది. దీనికి సమర్థవంతమైన పరిష్కారం కనుగొనగలిగేలా, ఇక నుంచి ఈ పిటిషన్‌ను క్రమం తప్పకుండా జాబితా చేస్తామని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.
అయితే 2004 నుంచి ఐఐటీ, ఇతర విద్యాసంస్థల్లో 50 మందికి పైగా విద్యార్థులు కుల వివక్ష కారణంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టుకు తెలిపారు. ఈ విద్యార్థులలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారే ఉన్నారని వెల్లడించారు. గతంలో యూనివర్సిటీల్లో సూసైడ్ చేసుకున్న విద్యార్థులు రోహిత్ వేముల, పాయల్ తాడ్వీల తరపున జైసింగ్ హాజరయ్యారు.