Hyderabad : రేపు ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లైఓవర్ ప్రారంభం

by M.Rajitha |   ( Updated:2025-01-05 15:31:59.0  )
Hyderabad : రేపు ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లైఓవర్ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరంలో నిర్మించిన రెండవ అతిపెద్ద ఫ్లైఓవర్(2nd Largest FlyOver) రేపు ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా సోమవారం ప్రారంభం కానుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేపై ట్రాఫిక్ రద్దీని నివారంచేందుకు ఆరాంఘర్ నుంచి జూపార్క్(Aramghar-Zoopark) వరకు 4.08 కిమీల పొడవైన ఫ్లైఓవర్ నిర్మించారు. దాదాపు రూ.800 కోట్లతో జీహెచ్ఎంసీ దీనిని నిర్మించింది. రోజురోజుకూ ఈ మార్గంలో పెరుగుతున్న విపరీతమైన ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని ఈ వంతెనకు రూపకల్పనకు చేశారు. నగరంలో పీవీఆర్ ఎక్స్ ప్రెస్ ఫ్లైఓవర్(PVR Express Flyover) తర్వాత రెండవ అతిపెద్ద వంతెన ఇదే. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నారు.

Advertisement

Next Story