Ration Rice Theft : పేర్ని నాని గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పరిణామం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-07 06:11:36.0  )
Ration Rice Theft : పేర్ని నాని గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పరిణామం
X

దిశ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) గోడౌన్ (Godown)లో రేషన్ బియ్యం మాయం కేసు(Ration Rice Theft Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులకు నిన్న మచిలీపట్నం కోర్టు ఒక రోజు పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో ఈ రోజు మచిలీపట్నం సబ్ జైలు నుండి నిందితులు A2, A4, A5 గా ఉన్న పేర్ని నాని గోడౌన్‌ మేనేజర్‌ మానస్‌తేజ, మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్‌ బోట్ల మంగారావునులను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కస్టడీలోకి తీసుకుని ప్రత్యేక పోలీస్ వాహనంలో తాలుకా పీఎస్ కు తరలించారు. న్యాయవాదుల సమక్షంలో సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరుపనున్నారు. అనంతరం వీరిని మళ్లీ రిమాండ్‌కు పంపుతారు.

పేర్ని నాని గోడౌన్‌ నుంచి సీఎంఆర్‌ బియ్యం మాయం కావడం, ఈ వ్యవహారంలో గోడౌన్‌ మేనేజర్‌, మిల్లు యజమాని, లారీడ్రైవర్‌, పేర్ని నాని కుటుంబ సభ్యుల ఖాతాలకు నగదు మళ్లింపు తదితర అంశాలపై పోలీస్‌ కస్టడీకి వచ్చే నిందితులను పోలీసులు విచారణ చేయనున్నారు. ఈ కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. జిల్లా పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న కోటిరెడ్డిని ఇదే కేసులో గతేడాది డిసెంబరు 30వ తేదీన పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ఆయనకు స్పెషల్‌ మొబైల్‌ కోర్టు న్యాయమూర్తి సోమవారం బెయిల్‌ను మంజూరు చేశారు.

ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధకు జిల్లా కోర్టు ముందస్తు బెయిల్‌ను గతేడాది డిసెంబరు 30వ తేదీన మంజూరు చేసింది. ఆ తర్వాత ఆమె పోలీసుల విచారణకు హాజరయ్యారు. సీఎంఆర్‌ బియ్యం మాయం కేసులో ఏ-2గా ఉన్న గోడౌన్‌ మేనేజర్‌ మానస్‌తేజ పోలీసుల విచారణలో మాజీ మంత్రి పేర్ని నాని చెప్పినట్లుగానే తాను చేశానని చెప్పడంతో పోలీసులు ఈ కేసులో ఏ-6గా మాజీ మంత్రి పేర్ని నాని పేరును చేర్చారు. అయితే పేర్ని నాని తనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం హైకోర్టులో ఈ కేసు విచారణకు రాగా, మంగళవారం నాటికి విచారణను వాయిదా వేశారు.

Advertisement

Next Story

Most Viewed