- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ram Charan: ‘ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా’.. గ్లోబల్ స్టార్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రస్తుతం ప్రమోషన్ల జోరులో ఉన్నారు మూవీ టీమ్. ఇందులో భాగంగా రామ్ చరణ్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్‌ను.. ‘అసలు మీరు నటించిన సినిమాల్లో ఏ సినిమా చేయకుండా ఉండాల్సింది అని ఫీలవుతున్నారు’ అని అడగగా.. దానికి చరణ్ స్పందిస్తూ.. ‘జంజీర్’ సినిమాను రిమేక్‌గా చేసినందుకు చింతిస్తున్నాను అని సమాధానమిచ్చాడు. అయితే ఈ చిత్రం తెలుగులో ‘తుఫాన్’ పేరుతో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించింది. కాగా అప్పటివరకు కేవలం తెలుగు సినిమాలే చేసిన చరణ్.. ‘జంజీర్’తో తొలిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. అపూర్వ లాఖియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
Read More ...
టికెట్ల ధరల పెంపు.. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు షాక్ ఇచ్చిన కోర్టు