డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మంత్రి నారా లోకేశ్

by Mahesh |
డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మంత్రి నారా లోకేశ్
X

దిశ, అనంతపురం ప్రతినిధి: నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్(Daku Maharaj) ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre-release event) గురువారం అనంతపురం శ్రీనగర్ కాలనీ అయ్యప్ప స్వామి గుడి సమీపంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ, చిత్ర యూనిట్ సభ్యులు విచ్చేయనున్నారు. ఈవెంట్ జరిగే ప్రదేశాన్ని బుధవారం జిల్లా ఎస్పీ జగదీష్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరిశీలించారు. వీరితో పాటు ఎన్ బీకె హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షుడు జగన్, ఎన్.బి.కె ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు గౌస్ మొద్దీన్, అనంతపురం టీడీపీ అధికార ప్రతినిధి, రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ కార్యనిర్వాహక కార్యదర్శి డేగల కృష్ణమూర్తి, పంచాయతీ రాజ్ ఛాంబర్ సభ్యులు ఇస్మాయిల్, టీఎన్ టీయూసీ జిల్లా అధికార ప్రతినిధి నిట్టూరు శివాజీ తదితరులు కూడా పరిశీలించారు. ఈ ఈవెంట్ నేపథ్యంలో నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రి నారా లోకేష్ గురువారం సాయంత్రం 3.30 గంటలకు విజయవాడ నుంచి బయలు దేరి 4.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి సాయంత్రం 6 గంటలకు అనంతపురం చేరుకుంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు జరిగే ఈవెంట్ లో పాల్గొంటారు.

Advertisement

Next Story