‘పదవులు కాదు.. జగ్గారెడ్డి అనే పేరే పర్మినెంట్’

by Gantepaka Srikanth |
‘పదవులు కాదు.. జగ్గారెడ్డి అనే పేరే పర్మినెంట్’
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఏ నాయకుడి కూడా పదవులు శాశ్వతం కాదని అన్నారు. నాయకుల పేర్లే శాశ్వతం అని తెలిపారు. ఎంత గొప్పగా పనిచేస్తే.. అంత గొప్పగా ప్రజల గుండెల్లో నిలిపోతామని అన్నారు. తాను ఏనాడూ పదవుల కోసం వెంపర్లాడ లేదని.. పదవి ఉంటే పొంగిపోవడం.. లేకుంటే కుంగిపోవడం తనకు తెలియదని చెప్పారు. జగ్గారెడ్డి అనే పేరే పర్మినెంట్ అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

జగ్గారెడ్డి అనే పేరుకు ముందు మాజీ, ప్రజెంట్ అనేవే టెంపరరీ అని వెల్లడించారు. ప్రజలు పదేళ్లు అవకాశం ఇస్తే.. బీఆర్ఎస్ నేతలు అడ్డంగా దోచుకుని.. అభివృద్ధి చేయకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్ (Congress Govt)ఎంతో అభివృద్ధి చేసిందని అన్నారు. ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలోనే లేదని అన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం కూడా లేదని తెలిపారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story