- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
RRR Case: తులసిబాబు అరెస్ట్.. రిమాండ్..!
దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంగోలు రిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఆయనకు ధర్మాసనం రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. కాగా గత ప్రభుత్వంలో రఘురామను అప్పటి సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ సమయంలో ఆయనను టార్చర్ చేశారు. కస్టోడియల్‌లో ఉన్న ఆయనను ప్రైవేటు వ్యక్తులతో హింసించారు. ఈ టార్చర్ అప్పటి సీఐడీ ఏఎస్పీ విజయ్ పాల్ ఆదేశాలతో జరిగినట్లు రఘురామరామ ఆరోపించారు. ఈ మేరకు సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన అధికారులు.. కీలక నిందితుడు విజయ్ పాల్ అని నిర్ధారించారు. ఈ మేరకు ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విజయ్ పాల్‌ను రెండు రోజుల కస్టడీలో తీసుకుని ప్రశ్నించారు. అయితే ఈ కేసులో మరింత విచారణ చేపట్టారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబును ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారించారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు.