- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BRIC-NII: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ నోటిఫికేషన్ విడుదల

దిశ,వెబ్‌డెస్క్: ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ(BRIC-NII) జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 22వ తేదీ వరకు అడ్మినిస్ట్రేటివ్ మరియు టెక్నికల్ కేడర్‌లోని వివిధ పోస్టులకు అన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. అప్లికేషన్‌కు అధికారిక www.nii.res.in ను సందర్శించండి.
పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8 పోస్టులు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ మరియు టెక్నికల్ కేడర్, మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫైనాన్స్ & అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల నియామక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
విద్యా అర్హతలు:
*మేనేజర్ (అడ్మిన్. & ఎస్టేట్) పోస్టులకు గ్రాడ్యుయేషన్ డిగ్రీ , సంబంధిత అనుభవం ఉండాలి.
*అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ డిగ్రీ, సంబంధిత అనుభవం
*ఫైనాన్స్ & అకౌంట్స్ ఆఫీసర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, సంబంధిత అనుభవం
*జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 12వ తరగతి పాస్ అండ్ టైపింగ్ నైపుణ్యాలు
*సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, సంబంధిత అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీకి 500/-, ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి 250/- చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.