- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Adah Sharma: పొట్టి దుస్తుల్లో క్యూట్ లుక్స్‌తో పడేస్తోన్న అల్లు అర్జున్ బ్యూటీ.. పోస్ట్ వైరల్!

దిశ, వెబ్‌డెస్క్: హిందీ హర్రర్ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ఆదా శర్మ (Adah Sharma). ఈ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. ఆదా శర్మ పోషించిన దయ్యం పట్టిన స్త్రీ పాత్ర విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో ఆదా శర్మ అద్భుతంగా నటించినందుకు గానూ.. ఈమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. తర్వాత రొమాంటిక్ చిత్రం హాసీ తో ఫసీలో అవకాశం దక్కించుకుంది.
తర్వాత హార్ట్ ఎటాక్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. వీటితో పాటుగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి మూవీలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. అనంతరం ఈ ముద్దుగుమ్మ క్షణం, ది కేరళ స్టోరీలో నటించింది. ది కేరళ స్టోరీ మూవీ అయితే జనాల్ని విపరీతంగా ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు.
1920, ఫిర్, హమ్ హై రాహి కార్ కే, రాణా విక్రమ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, ఇదు నమ్మ ఆలు, కమాండో 2, చార్లీ చాప్లిన్ 2, కల్కి, బైపాస్ రోడ్డు, కమాండో 3, ప్రశ్నార్థకం, సెల్ఫీ, కేరళ కథ, బస్తర్: ది నక్సల్ స్టోరీ, CD (క్రిమినల్ లేదా డెవిల్), తుమ్కో మేరీ కసమ్ వంటి హిందీ, తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది.
ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకుల్ని అలరిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు పొట్టి బట్టల్లో క్యూట్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్‌తో పాటు ‘ప్రతిదీ ఒక చుక్కతో ప్రారంభమవుతుంది’ అని ఓ క్యాప్షన్ కూడా పంచుకుంది.