మాజీ సీఎం జగన్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన పులివెందులకు పయనం

by Mahesh |   ( Updated:2025-03-27 03:08:47.0  )
మాజీ సీఎం జగన్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన పులివెందులకు పయనం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Former CM YS Rajasekhara Reddy) పెద్ద సోదరుడు అయిన ఆనంద్ రెడ్డి సతీమణి సుశీలమ్మ (85) అనారోగ్యంతో పులివెందులలో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె పులివెందుల (Pulivendula) లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో వై.ఎస్. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొద్ది రోజుల క్రితమే పెద్దమ్మ అనారోగ్యంగా ఉందని తెలియడంతో మాజీ సీఎం జగన్ వెళ్లి ఆస్పత్రిలో పరామర్శించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆమె మృతిచెందడంతో.. హుటాహుటిన ఇంటికి చేరుకున్న జగన్.. తన పెద్దమ్మ మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. కాగా సుశీలమ్మ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం పులివెందుల లో జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు.

Next Story

Most Viewed