Drone delivery: బెంగళూరులో డ్రోన్ డెలివరీ సేవలు.. 7 నిమిషాల్లోనే సరుకుల డెలివరీ

by Ramesh N |
Drone delivery: బెంగళూరులో డ్రోన్ డెలివరీ సేవలు.. 7 నిమిషాల్లోనే సరుకుల డెలివరీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: నగరాల్లో ట్రాఫిక్ కారణంగా ఫుడ్, సరుకులు లేట్ అవ్వడంతో కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తారు. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు వినియోగదారులకు (Drone delivery services) డ్రోన్లతో వేగవంతమైన సేవలందించేందుకు ప్రముఖ డ్రోన్ లాజిస్టిక్స్ కంపెనీ స్కై ఎయిర్‌ సంస్థ ముందుకొచ్చింది. కేవలం 7 నిమిషాల్లోనే (మెడిసిన్) మందులు, సరుకులు అందజేస్తామని స్కై ఎయిర్‌ సంస్థ (Sky Air Company) కస్టమర్లకు హామీ ఇచ్చింది. (Bengaluru) బెంగళూరులోని కోణనకుంట, కనకపుర రోడ్డు ప్రాంతాల్లో సంస్థ డ్రోన్ డెలివరీ సేవలను ప్రారంభించింది. కొన్ని రోజులుగా నగరంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించింది. త్వరలో సేవలను విస్తరించే ప్రణాళికలతో ఉంది. స్కై యూటీఎమ్ నావిగేషన్ టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్‌లు అమోదించబడిన కారిడార్లలో సేవలు అందించనున్నారు.

బ్లూడార్ట్, డీటీడీసీ, షిప్‌ రాకెట్, ఈకామ్‌ ఎక్స్‌ప్రెస్, శ్రీమారుతి తదితర సంస్థలకు చెందిన ఆర్డర్లను పంపిణీ చేయనున్నట్లు సంస్థ సీఈఓ అంకిత్‌ కుమార్‌ ఇటీవల వెల్లడించారు. ఇప్పటికే గుర్‌గ్రామ్‌లో ఈ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. గత ఏడాది 1 మిలియన్ డ్రోన్ డెలివరీలను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ డ్రోన్ పేరు స్కై షిప్ వన్, అధిక సామర్థ్యం గల ఈ డ్రోన్లు ఒక ట్రిప్‌లో 10 కిలోల బరువైన వస్తువులతో 120 మీటర్ల ఎత్తులో ఎగరడంతో పాటు, సొరంగ మార్గాల్లోనూ ప్రయాణిస్తాయని వివరించారు. డెలివరీ పూర్తయిన తర్వాత తిరిగి బయల్దేరిన చోటుకు చేరతాయని, వీటిలో బ్లాక్‌బాక్స్‌లూ ఉంటాయని చెప్పుకొచ్చారు.

గత రెండు ఏళ్లుగా బెంగళూరులో మానవరహిత ఎయిర్ టాక్సీలు, డ్రోన్ల గురించి ప్రచారం జరుగుతున్నప్పటికీ, తాజాగా బెంగళూరులో డ్రోన్ డెలివరీ ఈ సేవలను స్కై ఎయిర్ సంస్థ ప్రారంభించింది. ఈ క్రమంలోనే నెట్టింట వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బెంగళూరులో ఈ డ్రోన్ డెలివరీ సక్సెస్ అయితే.. ఇకపై దేశంలోని పలు నగరాల్లో ఇలా డ్రోన్ డెలివరీ సేవలు ప్రారంభం అయ్యే చాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డ్రోన్ డెలివరీ సేవలు వ్యాప్తి చెందితే.. డెలివరీ డెలివరీ బాయ్స్‌కు పనిలేకుండా పోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed