congress: మోడీ గడ్డపై కాంగ్రెస్ గర్జన.. అహ్మదాబాద్ లో మొదలైన సీడబ్ల్యూసీ మీటింగ్స్

by Prasad Jukanti |
congress: మోడీ గడ్డపై కాంగ్రెస్ గర్జన.. అహ్మదాబాద్ లో మొదలైన సీడబ్ల్యూసీ మీటింగ్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్‌లోని అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశాలు (Congress CWC meetings) ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. మహాత్మాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి వందేళ్లు, సర్దార్ వల్లాభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సీడబ్ల్యూసీ సమావేశాలకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంకాగాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు రాబోయే ఎన్నికలు, పార్టీ పునరుజ్జీనం కోసం అవసరమైన రోడ్ మ్యాప్‌పై చర్చించి కార్యాచరణ, తీర్మానాలు చేసే అవకాశం ఉంది. అలాగే ఇతర పార్టీలతో పొత్తులపై కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్ కనిపిస్తోంది. అయితే 64 ఏళ్ల సుధీర్ఘ విరామం తర్వాత తిరిగి ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా ఏఐసీసీ కీలక సమావేశం నిర్వహిస్తుండటం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

ఎన్నికల వ్యూహాలు, పొత్తులపై చర్చ!

దేశ రాజకీయాల్లో దూకుడు మీదున్న బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది చివరిలో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు, 2026లో తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇండియా కూటమిగా ఎన్నికలకు వెళ్లడం, ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుభవాలపై చర్చించనున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తు అంశాలపై డిస్కస్ చేయనున్నారు. బీజేపీని ఎదుర్కొనే విషయంలో పార్టీ పోరాటాలు, ఇతర పార్టీలతో పొత్తుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు ఉండనున్నాయి.

తెలంగాణ నుంచి 40 మందికి ఆహ్వానం

ఈ సమావేశాలకు తెలంగాణ నుంచి 40 మంది నేతలకు ఆహ్వానం అందింది. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, వంశీ చందర్‌రెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed