- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘కేసరి వీర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫియర్‌లెస్ నటుడు యోధుల కథతో వచ్చేస్తున్నాడంటూ ట్వీట్

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్‌శెట్టి(Sunil Shetty) నటిస్తున్న తాజా చిత్రం ‘కేసరి వీర్’(Kesari Veer: Legends of Somnath). ప్రిన్స్ ధిమాన్(Prince Dhiman) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను చౌహాన్ స్టూడియోస్, పనోరమా స్టూడియోస్ బ్యానర్స్‌పై కను చౌహాన్ నిర్మిస్తున్నారు. ఇందులో సూరజ్ పంచోలి, వివేక్ ఒబెరాయ్, ఆకాంక్ష శర్మ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చారిత్రక ఇతిహాసం 14వ శతాబ్దంలో అక్రమణదారులు నుంచి సోమనాథ్ ఆలయాన్ని రక్షించిన యోధుల ధైర్యసాహసాలను వెలుగులోకి తెస్తుంది. హిందూ విశ్వాసాన్ని రక్షించడానికి తుగ్లక్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన ధైర్య యోధుడు హమీర్జీ గోహిల్ కథ ఆధారంగా రాబోతుంది.
అయితే ఈ సినిమా మార్చి 14న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటిస్తూ మూవీ మేకర్స్ షాకింగ్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ మూవీ మే 16న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. ఇక పోస్టర్ గమనించినట్లు అయితే.. ఇందులో సునీల్ శెట్టి ఓ ఆలయం ముందు నిలబడి ఉండగా.. ఓ కట్టేను పట్టుకుని కోపంగా కనిపించాడు. ఇక ఇందులో రక్తంతో ఉన్న ఓ పరికరం కూడా కనిపించింది. ఈ పోస్ట్‌కు మూవీ మేకర్స్ ‘‘‘‘సునీల్‌శెట్టి కేసరి వీర్‌లో నిర్భయమైన వేగదాజీగా పూర్తి శక్తితో తిరిగి వచ్చాడు.: లెజెండ్స్ ఆఫ్ సోమనాథ్! పురాణ సోమనాథ్ యుద్ధానికి వ్యతిరేకంగా సెట్ చేయబడిన శక్తివంతమైన యోధుల కథ, 16 మే 2025న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్స్‌లోకి రాబోతుంది’’ అని రాసుకొచ్చారు.