Hero Karizma XMR 210: కరీనా కపూర్‌ కంటే యూత్‌కు ఈ కరిజ్మానే ఇష్టం.. ఎక్స్ఎంఆర్-210 బైక్ కొత్త ఫీచర్లు చూశారా?

by Vennela |
Hero Karizma XMR 210:  కరీనా కపూర్‌ కంటే యూత్‌కు ఈ  కరిజ్మానే ఇష్టం.. ఎక్స్ఎంఆర్-210 బైక్ కొత్త ఫీచర్లు చూశారా?
X

దిశ, వెబ్ డెస్క్: Hero Karizma XMR 210: హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 మోటార్ సైకిల్ ను కంబాట్ అనే కొత్త వేరియంట్ తో మార్కెట్లోకి పరిచయం చేశారు. ఇది బేస్ టాప్ వేరియంట్లలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ బైక్ ధర రూ. 1.81లక్షలు. రూ. 201లక్షల వరకు ఉంటుంది. హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 మోటార్ సైకిల్ డిజైన్ లో ఎలాంటి ముఖ్యమైన మార్పులు లేవు. ఇది అద్భుతమైన ఎల్ఈడీ హెడ్ లైట్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్ లు , మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, స్ప్లిట్ సీట్ సెటప్ ను కలిగి ఉంది. కొత్త కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 బేస్, టాప్ వేరియంట్లు ఐకానిక్ ఎల్లో, టర్బో రెడ్, మ్యాట్ ఫాంటమ్ బ్లాక్ రంగుల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. దీనితో ఈ మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే అందరి ఫోకస్ మీ మీదే ఉంటుంది.

కొత్త హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 బైక్ మరింత పవర్ ఫుల్ 210 సీసీ, సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ ను పొందుతుంది. ఇది 9,250 ఆర్పీఎమ్ వద్ద 25.15 బీహెచ్ పీ హార్స్ పవర్, 7250 ఆర్పీఎమ్ వద్ద 20.4 ఎన్ఎం పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ గేర్ బాక్స్ కూడా ఉంది.

ఇక ఈ హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 మోటార్ సైకిల్ అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. ముఖ్యంగా ఇది స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో 4.2అంగుళాల టీఎఫ్టీ ఇన్స్టుమెంట్ కన్సోల్ ను పొందుతుంది. కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ కూడా అందిస్తుంది. కొత్త బైకులో ఫ్రంట్ సైడ్ లో అప్ సైడ్ డౌన్ ఫోర్స్ సస్పెన్షన్ ఆప్షన్ ఉంది. రైడర్ వ్యూ కోసం దీనికి డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఇది డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ను కలిగి ఉంది. రోడ్డుపై గట్టిపట్టును అందించేందుకు 17అంగుళాల అల్లాయ్ వీల్స్ ను పొందుతుంది. కొత్త హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 మోటార్ సైకిల్ విడుదల యూత్ కు తెగ నచ్చేస్తుంది. ఇది ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో ఉంటుంది. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో యూత్ దీనిని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.

Next Story

Most Viewed