- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వాంఖడే స్టేడియంలో స్టాండ్‌కు రోహిత్ పేరు.. హిట్‌మ్యాన్ స్పందన ఇదే

దిశ, స్పోర్ట్స్ : వాంఖడే స్టేడియంలో ఓ స్టాండ్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎంసీఏ ఆధ్వర్యంలో ముంబై టీ20 లీగ్ మే 26 నుంచి ప్రారంభంకానుంది. ఈ లీగ్‌కు రోహిత్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. శుక్రవారం ఈ లీగ్ 3వ ఎడిషన్‌కు సంబంధించి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రోహిత్ మాట్లాడుతూ.. ‘నేను ఆడే మ్యాచ్‌లో స్టేడియంలో నా పేరుతో స్టాండ్ ఉండటమనేది నిజమేనా అని నమ్మలేకపోతున్నా. ఇది నా జీవితంలో ఇది అతిపెద్ద గౌరవం. ఆట ఆడటం మొదలుపెట్టినప్పుడు మనం ఎంత కాలం ఆడతామో తెలియదు. ఆడే సమయంలో మనం సాధించే మైలురాళ్లు, విజయాలను పక్కనపెట్టండి. కానీ, ఈ ఇలాంటి గౌరవం, ఓ స్టాండ్‌కు పేరు పెట్టడం అనేది నేను ఊహించలేదు. స్టాండ్‌పై నా పేరు చూసినప్పుడు చాలా ఎమోషనల్ మూమెంట్ అవుతుంది. స్టేడియంలోకి ప్రవేశించని రోజుల నుంచి అదే స్టేడియంలో ఓ స్టాండ్‌కు నా పేరు పెట్టే వరకు మధ్యలో చాలా జరిగాయి. ముంబై రంజీ జట్టు ప్రాక్టీస్ చూడటానికి వాంఖడే స్టేడియం వెలుపల నిలబడి ఉన్న రోజులు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి. అజాద్ మైదానంలో మేము అండర్ 14, 16 ట్రైనింగ్‌ను పూర్తి చేసి రంజీ ట్రోఫీ క్రికెటర్లను చూడటానికి వెళ్లేవాళ్లం. అప్పట్లో వాంఖడే స్టేడియం లోపలికి వెళ్లడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇప్పుడు కూడా అంతే. అప్పటి రోజులు ఎప్పటికీ గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తా.వాంఖడేలోనే నా మొదటి గేమ్ ఆడా. ఆ తర్వాత ఎన్నో మరుపురాని మ్యాచ్‌లు ఆడాను.’అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
- Tags
- Rohit sharma