- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు.. ప్రజలకు అలర్ట్

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎండల తీవ్రత (Intensity of the sun) రోజు రోజుకు పెరిగిపోతుంది. రెండు రోజుల క్రితం ద్రోణి ప్రభావం తో పలు ప్రాంతాల్లో వర్షాలు పడటంతో వాతావరణం కాస్త చల్లబడింది. కానీ ద్రోణి ప్రభావం తగ్గడంతో రెండు రాష్ట్రాల్లో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నెల మొదటి వారం నుంచే ఎండలు ప్రారంభం కాగా.. మే నెల నాటికి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి.
మే నెలలో కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని, తీవ్రమైన వడగాల్పులు (heatwaves) వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Department of Meteorology) సూచిస్తోంది. ఈ సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ (Telangana)లో కూడా పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42-44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో 2-3 డిగ్రీల అదనపు పెరుగుదల ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వేడిమి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రజలు ఎక్కువ నీరు తాగాలని, మధ్యాహ్న సమయంలో బయట తిరగడం తగ్గించాలని అధికారులు సలహా ఇస్తున్నారు.