పండగ పూట భారీగా సొత్తు చోరీ.. ఎక్కడంటే..?

by Kalyani |
పండగ పూట భారీగా సొత్తు చోరీ.. ఎక్కడంటే..?
X

దిశ, పరిగి : ఉక్కపోతగా ఉందని డాబా( ఇంటి పైన) పైన నిద్రిస్తుండగా ఇంటికి కన్నం వేశారు దొంగలు. ఏకంగా తొమ్మిది తులాల బంగారం, ఓ కిలో వెండి ఆభరణాలు, 60 వేల నగదు ఎత్తుకెళ్ళారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… పరిగి మండలం హనుమాన్ గండి తండాకు చెందిన మూడవ శ్రీనివాస్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి డాబా పై పడుకున్నారు. హనుమాన్ గండి తండా హైవే రోడ్డు పక్కనే ఉండడంతో తాళం వేసి ఉంది కదా అంటూ దొంగలు టార్గెట్ చేశారు. తాళం విరగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా తాళం పగలగొట్టి అందులో ఉన్న 9 తులాల బంగారు, కిలో వెండి ఆభరణాలు, 60 వేల నగదును ఎత్తుకెళ్లారు. సుమారు 8,80,000 సొత్తు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు మూడవ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్ఐ సంతోష్ సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ.సంతోష్ కుమార్ తెలిపారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed