ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చిన ఇద్దరు స్టార్ హీరోయిన్లు.. చూడటానికి రెండు కళ్లు సరిపోవట్లేదు అంటున్న నెటిజన్లు

by Kavitha |
ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చిన ఇద్దరు స్టార్ హీరోయిన్లు.. చూడటానికి రెండు కళ్లు సరిపోవట్లేదు అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి స్టార్ హీరోయిన్లు త్రిష(Trisha), చార్మి(Charmi)ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. ఇక త్రిష ప్రజెంట్ కూడా అదే ఫామ్‌లో ఉంది. కానీ చార్మి మాత్రం పూర్తిగా సినిమాలకు దూరమయ్యింది. కానీ నిర్మాతగా వ్యవహరిస్తోంది. అలాగే రీసెంట్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’(Double Ismart) చిత్రానికి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. ఇక త్రిష మాత్రం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా త్రిష ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో చార్మితో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘నా బెస్ట్ గాల్స్‌లో ఒకరితో గడిపిన ఉత్తమ సమయాలు.. 20 సంవత్సరాలు అండ్ ఇంకా చాలా ఉన్నాయి’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఒకే ఫ్రేమ్‌లో ఇలా మీ ఇద్దరినీ చూస్తుంటే రెండు కళ్లు సరిపోవట్లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ భామ పోస్ట్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

Next Story

Most Viewed