- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కూకట్ పల్లిలో యువకుడు ఆత్మహత్య.. తీవ్ర కలకలం రేపుతున్న ఘటన

దిశ, కూకట్పల్లి: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హబీబ్‌నగర్ కాలనీలో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. సిఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం హబీబ్‌నగర్‌కు బోరింగ్ గల్లికి చెందిన మొహ్మద్ పాషా కొడుకు మొహ్మద్ ఛోటు(25) గత నాలుగు నెలలుగా తీవ్రమైన నడుం నొప్పి, కుడి చేతి నొప్పితో బాధపడుతున్నాడు. వైద్యం చేయించుకున్న నొప్పి తగ్గకపోవడంతో.. మనస్థాపం చెందిన మొహ్మద్ ఛోటు శుక్రవారం ఉదయం రెండవ అంతస్థులోని గదిలో ప్లాస్టిక్ తాడుతో ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. పాషా మూడవ కొడుకు చాంద్ గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వైద్యం కోసం ఎర్రగడ్డలోని చర్చి హాస్పిటల్‌కు తరలించగా వైద్యులు పరిక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధృవీకరించారు. తమ సోదరుడు తీవ్రమైన నడుం నొప్పి, చేతి నొప్పితో మనస్థాపం చెంది ఉన్నాడని, నొప్పి భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతుడి సోదరుడు మొహ్మద్ మహబూబ్ పోలీసులకు తెలిపాడు.