- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Redmi Projector 3 Lite: కేవలం రూ.8వేలకే రెడ్ మీ ప్రొజెక్టర్.. ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే

దిశ,వెబ్ డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సంస్థ రెడ్‌మీ తరచూ సరికొత్త ఫీచర్లతో గ్యాడ్జెట్లను మార్కెట్‌లో విడుదల చేస్తోంది. రెడ్‌మీ మొబైల్స్‌తో పాటూ లాప్ టాప్స్, టిమ్మర్స్ ఇతర వస్తువులను సైతం లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు అతి తక్కువ ధరలోనే రెడ్‌మీ ప్రొజెక్టర్‌ను తయారు చేసింది. రెడ్‌మీ ప్రొజెక్టర్ 3లైట్ పేరుతో దీనిని ఎప్రిల్ 22న చైనా మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. దీని ధర 96 డాలర్స్‌గా నిర్ణయించగా ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.8వేలగా ఉంది. అత్యాధునిన ఫీచర్స్‌తో ఈ ప్రొజెక్టర్ తయారు చేయడం విశేషం.
ఇది పూర్తిగా క్లోజ్డ్ ఆప్టికల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇమేజ్ క్వాలిటీలో ఎలాంటి తేడా రాకుండా 20 డిగ్రీల వరకు సైడ్ ప్రొజెక్షన్ ఉండేలా తయారు చేశారు. దీని అప్ గ్రేడ్ చేసిన కూలింగ్ మెకానిజం ఫ్యాన్ శబ్దాన్ని2 డెసిబుల్స్ వరకు తగ్గిస్తుంది. కాబట్టి ప్రొజెక్టర్ నుండి శబ్దం కూడా చాలా తక్కువగా వస్తుంది. 180 CVIA ల్యూమెన్స్ ప్రకాశాన్ని అందించే ఈ ప్రొజెక్టర్ ద్వారా 1080పీ హెచ్‌డీ క్వాలిటీలో వీడియోలు చూడవచ్చు. ఫుల్ క్లారిటీతో 100 అంగుళాల పరిమాణం వరకు ఈ ప్రొజెక్టర్ ద్వారా సినిమాలు చూడవచ్చు. కండ్లపై సైతం ఎలాంటి ఒత్తిడి పడకుండా దీనిని తయారు చేశారు.
ఇందులో క్వాడ్ కోర్ అమ్లాజిక్ T950S ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది 1.5 GHz వేగంతో పనిచేస్తుంది. అదేవిధంగా ఈ ప్రొజెక్టర్‌లో 1 GB RAM, 32 GB మెమరీ ఇన్ బిల్డ్‌గా ఉంది. ఇది ఆటో ఫోకస్ మరియు కీస్టోన్ కరెక్షన్ కోసం టీవోఎఫ్ లేజర్ సెన్సార్‌ను కలిగి ఉంది. గతంలో వచ్చిన మోడళ్లతో పోలిస్తే 20శాతం వేగవంతమైన ఆటోఫోకమ్ మరియు 13శాతం వేగవంతమైన ఇమేజ్ కరెక్షన్‌ను కలిగి ఉంది. ఈ ప్రొజెక్టర్ ఇండియన్ మార్కెట్‌లోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. మీకూ ప్రొజెక్టర్ తీసుకోవాలని కోరిక ఉంటే దీనిపై కూడా ఓ లుక్కేయండి.