- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ముఖాముఖి యుద్ధం ప్రారంభమవుతుంది.. అంచనాలను పెంచిన ‘సర్దార్-2’ వైల్డ్ పోస్టర్

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ శివకుమార్(Karthik Shivakumar) గత ఏడాది ‘సత్యం సుందరం’ (Satyam Sundaram)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ సాధించారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. కార్తి నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్-2’(Sardar-2). ఈ సినిమా 2022లో వచ్చిన ‘సర్దార్’ కు సీక్వెల్‌గా రాబోతుంది. పీఎస్ మిత్రన్(P.S. Mitran) దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోంది. ఈ మూవీలో మాళవిక మోహనన్(Malavika Mohanan), అషికా రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. అయితే ‘సర్దార్-2’ సినిమాలో ఎస్ జె సూర్య(SJ Surya) విలన్‌గా కనిపించబోతున్నాడు.
దీనికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇందులో కార్తి సర్దార్ కొడుకు పాత్ర రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా.. నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సర్దార్ డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసుకోగా.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. తాజాగా, మూవీ మేకర్స్ ‘సర్దార్-2’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్‌కు ‘‘ముఖాముఖి మొదలవుతుంది’’ అనే క్యాప్షన్ చేసి రెండు కత్తులను పెట్టారు. అయితే ఇందులో ఎస్ జె సూర్యకు కార్తికి మధ్య పోరు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక మూవీ మేకర్స్ విడుదల చేసిన వీడియోలో కార్తి విలన్స్‌ను చితకొడుతూ గుబురు గడ్డంతో వైల్డ్ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ‘సర్దార్-2’ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది.
The faceoff begins ⚔️#Sardar2 Prologue ▶️ https://t.co/iZSuRXv4HV@Karthi_Offl @Prince_Pictures @ivyofficial2023 @Psmithran @iam_SJSuryah @lakku76 @venkatavmedia @RajaS_official @B4UMotionPics @MalavikaM_ @AshikaRanganath @rajishavijayan @iYogiBabu @SamCSmusic @george_dop… pic.twitter.com/JYJsaQLKYe
— Prince Pictures (@Prince_Pictures) March 31, 2025