Samantha: షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన సమంత.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు(పోస్ట్)

by Kavitha |
Samantha: షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన సమంత.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) మనందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో నటించి అలరించిన ఈ బ్యూటీ నాగచైతన్య(Naga Chaitanya)తో విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే మహమ్మారి బారిన పడింది. అప్పటినుంచి దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండి రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్‌సిరీస్‌తో మనముందుకు వచ్చింది. ఈ సిరీస్‌లో తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ‘శుభం’(Subham) అనే సినిమా చేస్తుంది.

అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ శారీ కట్టుకొని హెయిర్ లీవ్ చేసుకుని దర్శనమిచ్చింది.

ఇక వాటికి ‘ఇన్ ఎ డ్రీమ్’ అనే క్యాప్షన్ కూడా జోడించింది. అయితే సామ్ చాలా సన్నబడి షాకింగ్ లుక్‌లో కనిపించింది. అంతకుముందు ఫొటోల కన్నా ఇందులో చాలా చిక్కిపోయి కనిపించింది. దీంతో ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. ఆమెకు మయోసైటీస్ తొందరగా తగ్గిపోవాలని దేవుడిని కోరుకుంటున్నారు. ప్రస్తుతం సామ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed