- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Best Recharge Plans: బెస్ట్ రీచార్జ్ ప్లాన్స్.. 345 తో 60 రోజులు వ్యాలిడిటీ

దిశ, వెబ్ డెస్క్: Best Recharge Plans: తక్కువ ధరకే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. దాదాపు 2 నెలలపాటు ఉండే ప్లాన్ కోసం వెతుకుతున్నారా. అయితే ఈ ప్రత్యేక జాబితా మీకోసం. ఈ ప్లాన్స్ ప్రారంభ ధర రూ. 345 అంటే మీరు రూ.6కంటే తక్కువ ధరకే ప్రతిరోజూ డేటా, కాల్స్ ఆస్వాదించవచ్చు. మీరు తక్కువ ఖర్చుతో రెండు నెలలపాటు ఉండే రీఛార్జ్ ప్లాన్స్ కోసం చూస్తే జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్స్ మీ బెస్ట్ ఛాయిస్ కావచ్చు. ఈ ప్లాన్స్ ప్రారంభ ధర రూ. 345తో రోజువారీ డేటా, కాల్స్ కోసం వాడుకోవచ్చు.
బీఎస్ఎన్ఎల్ రూ. 345 ప్లాన్
బీఎస్ఎన్ఎల్ రూ. 345 ప్లాన్ లో మీరు పూర్తిగా 60 రోజుల చెల్లుబాటు పొందుతారు. ఈప్లాన్ లో మీరు అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ ప్రయోజనాన్ని పొందుతారు. దీంతోపాటు ఈ ప్లాన్ ప్రతిరోజూ 1జీబీ డేటా రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ ల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్ రోజువారీ ధర రూ. 5.75.
ఎయిర్ టెల్ రూ. 619 ప్లాన్
ఎయిర్ టెల్ ఈ ప్లాన్ 60రోజులపాటు వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 2.5జీబీ డేటాను అందిస్తుంది. దీంతోపాటు 60రోజుల చెల్లుబాటుతో ఉన్న ఈ ప్లాన్ లో కస్టమర్ అన్ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్ పొందుతారు. ఈ ప్లాన్ రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.
ఎయిర్ టెల్ రూ. 649ప్లాన్:
ఈ ప్లాన్ 56రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ లో వినియోగదారుడు అన్ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్ పొందుతారు. దీంతోపాటు రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ లో కస్టమర్ రోజుకు 2జీబీ డేటా బెనిఫిట్ పొందుతారు.
బీఎస్ఎన్ఎల్ రూ. 347 ప్లాన్
బీఎస్ఎన్ఎల్ రూ. 347ప్లాన్ కూడా మీకు బెస్ట్ ఛాయిన్ అని చెప్పవచ్చు. ఈ ప్లాన్ లో మీరు 56రోజుల చెల్లుబాటు లభిస్తుంది. ఈ ప్లాన్ లో మీకు అన్ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ బెనిఫిట్ లభిస్తుంది. దీంతోపాటు మీరు ప్రతిరోజూ 2జీబీ డేటా రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా పొందుతారు.
జియో రూ. 579 ప్లాన్
జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1.5 జీబీ డేటా తో వస్తుంది. మీకు 56 రోజుల వరకు చెల్లుబాటు లభిస్తుంది. ఈ ప్లాన్ లో మీరు ఫ్రీకాలింగ్ రోజుకు 100ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి. దీంతోపాటు జియో, ఈ ప్లాన్ లో జియో యాప్ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉంటాయి.