- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘తెలియక చేశాను..క్షమించండి’ సీతమ్మ మెడలో తాళి కట్టడంపై ఎమ్మెల్యే వివరణ

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా ( Kurnool) ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ( Alur MLA Virupaksha ) అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏకంగా సీతమ్మ ( Seethamma) వారికే తాళికట్టారు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. ఈ సంఘటన ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపైన హిందుత్వ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శ్రీరామ నవమి ( Sri Rama Navami) పండుగ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... దేశవ్యాప్తంగా శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
అయితే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కూడా.. చాలా ప్రాంతాల్లో రాముల వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ తరుణంలోనే ఆ నియోజకవర్గంలోని చిప్పగిరి లో ( Chippagiri)... సీతారాముల కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా సీతమ్మవారికి స్వయంగా ఎమ్మెల్యే విరూపాక్షి తాళికట్టారు. సీతమ్మ వారి మంగళసూత్రం తాకి ఇవ్వమని, ఎమ్మెల్యే విరూపాక్షికి పండితులు తాళి ఇచ్చారు. అయితే.. ఆ తాలిని కళ్ళకు అద్దుకోవాల్సింది పొగా... పొరపాటున సీతమ్మవారికి ఆ మంగళసూత్రాన్ని కట్టేశారు ఎమ్మెల్యే విరూపాక్షి.
అయితే ఈ తథంగాన్ని అడ్డుకోకుండా పండితులు కూడా అక్షింతలు వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో... ఎమ్మెల్యే పై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. అయితే దీనిపై విమర్శలు రావడంతో క్షమాపణలు కూడా చెప్పారు ఎమ్మెల్యే విరూపాక్షి. పండితులు కట్టమంటే... తాను సీతమ్మ మెడలో తాళిబొట్టు కట్టినట్లు వివరించారు. దేవుళ్ళ పైన తనకు ఎంతో భక్తి అలాగే విశ్వాసం ఉందని కూడా వివరించారు. 15 సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేస్తున్నానని కూడా క్లారిటీ ఇచ్చారు విరూపాక్షి.