Show Time: భయపెట్టేందుకు వచ్చేస్తున్న నవీన్ చంద్ర.. ‘షో టైం’ నుంచి పోస్టర్ రిలీజ్

by Kavitha |   ( Updated:2025-04-01 15:29:45.0  )
Show Time: భయపెట్టేందుకు వచ్చేస్తున్న నవీన్ చంద్ర.. ‘షో టైం’ నుంచి పోస్టర్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: నవీన్ చంద్ర(Naveen Chandra), కామాక్షి భాస్కర్(Kamakshi Bhaskar) జంటగా నటించిన మూవీ ‘షో టైమ్’(Show Time). ఈ చిత్రాన్ని మదన్ దక్షిణామూర్తి(Madan Dakshinamurthy) తెరకెక్కిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ నెం.1 పతాకంపై కిషోర్ గరికిపాటి(Kishore Garikapati) ఈ మూవీని నిర్మిస్తుండగా.. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఇక ఈ మూవీని ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఓ కుటుంబం అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటే వాటి నుంచి ఎలా బయటపడ్డారనే కాన్సెప్టు ద్వారా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే.. ఓ పోలీస్ అధికారి నుంచి నవీన్ తన భార్య, కూతురును ఎలా కాపాడుకున్నాడనే కోణంలో ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. చూస్తుంటే ఏదో క్రైమ్ థ్రిల్లర్ మాదిరిగా అనిపిస్తోంది. నవీన్ చంద్ర గతంలో కూడా కొన్ని క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు మరోసారి అదే కాన్సెప్ట్‌తో వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story

Most Viewed