- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భారతదేశం సర్వమత సమ్మేళనం : ఇల్లందు ఎమ్మెల్యే

దిశ,ఇల్లందు: భిన్నత్వంలో ఏకత్వంగా విరాజిల్లు అన్ని మతాలకు సముచిత న్యాయం కల్పిస్తున్నది భారతదేశం అని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ముస్లిం పవిత్ర పండుగ రంజాన్ ను పురస్కరించుకొని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లందు పలు ఈద్గాలలో సోమవారం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరోపకారానికి, సహనానికి ప్రతీక రంజాన్ పండుగ అని అన్నారు. భారతదేశం సర్వ మతాలకు నిలయమని ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
గత ప్రభుత్వం మైనార్టీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, బొల్లా సూర్యం, మడుగు సాంబమూర్తి, చిల్ల శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీ పాషా, మాజీ ఎంపీటీసీ పూణెం సురేందర్, కాకాటి భార్గవ్, డి శివ కుమార్, ఉల్లింగ సతీష్, నవీన్, రవి, మున్నాభాయ్, అప్రిద్, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.