- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
MOST WATCHED WEB SERIES: నెట్ ఫ్లిక్స్ లో దుమ్ము రేపుతున్న క్రైమ్ డ్రామా.. మీరు చూశారా?

దిశ, వెబ్‌డెస్క్: నెట్ ఫ్లిక్స్ లో క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ సంచలనం సృష్టిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ఇప్పటి వరకూ ప్ర పంచవ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువ మంది చూసిన సిరీస్ ల జాబితాలోకి దూసుకురావడం ఇప్పుడు విశేషం నిలుస్తుంది. ఈ సిరీస్ ను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్ ను కేవలం ఒకే టేక్ లో షూట్ చేయడం ఈ వెబ్ సిరీస్ స్పెషాలిటీ. అంటే సిరీస్ మొత్తం ఎలాంటి కట్స్, ఎడిటింగ్ లేకుండా ఒకే షాట్ లో అలా సాగుతూ వెళ్తుంది. దీంతో తొలి రోజు నుంచే వస్తున్న పాజిటివ్ రివ్యూలతో అడోల సెన్స్ (Adolescence) అనే వెబ్ సిరీస్ కు 11 రోజుల్లోనే ఏకంగా 66.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటి వరకూ ఇదే అత్యధికం.
ఇంతకీ ఏంటి ఈ వెబ్ సిరీస్?
ఈ సిరీస్ ఓ 13 ఏళ్ల స్టూడెంట్ జేమీ మిల్లర్ (ఓవెన్ కూపర్) చుట్టూ నడుస్తుంది. అతడు తన క్లాస్మేట్ ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అవుతాడు. తాను ఏ నేరం చేయలేదని అతడు వాదిస్తాడు. కానీ ఆధారాలు అన్ని అతనికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఈ కేసు నుంచి ఎలా బయటపడతాడన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు.