- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అమృత్ - 2 పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

దిశ ప్రతినిధి, నిజామాబాద్ ఏప్రిల్ 10: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో అమృత్ 2 స్కీంలో భాగంగా జరుగుతున్న పనులపై అర్బన్ ఎమ్మెల్యే గురువారం సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబంధిత ప్రజారోగ్య శాఖ అధికారులతోసమీక్ష జరిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.162 కోట్లు, వాటర్ సప్లయ్ పనులకు మంజూరైన రూ.217 కోట్లు నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై అధికారులు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కు వివరించారు. నగరంలో 150 మ్యాన్ హోల్స్ పునర్నిర్మాణం చేసి, కొత్తగా 45 మ్యాన్ హోల్స్ నిర్మాణం చేసినట్లు అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒక కిలోమీటర్ పైప్ లైన్ వేసినట్లు, వాటర్ సప్లయ్ కోసం కొత్తగా రెండు వాటర్ ట్యాంకుల నిర్మాణం పనులు జరుగుతున్నట్లు అధికారులు ఎమ్మెల్యేకు నివేదించారు.
రానున్న వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరత గతిన పూర్తి చేయాలన్నారు. పనులన్నింటినీ నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే ధన్ పాల్ అధికారులకు సూచించారు. వేసవి కాలంలో నగర వాసులు మంచినీటికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ధన్ పాల్ అధికారులకు సూచించారు. మంచినీటి ట్యాంకులు నాలా సౌకర్యం కల్పించాలని ఆయన ఆదేశించారు.సీసీ రోడ్ల నిర్మాణం పనులు నాణ్యతతో చేపట్టాలని, నిర్మాణ పనులను వేగవంతం చేసి వేసవిలోగా పూర్తి చేయాలని, ప్రజోపయోగంలోకి తేవాలన్నారు. సమీక్షలో ఈఈ తిరుపతి, డీఈ నగేష్ రెడ్డి, మేఘా ఇంజినీర్ యువరాజ్, ఏఈ వీణావాణి, సుకుమార్, సాయిచంద్, శివ కృష్ణలున్నారు.