- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సంపద వనం లోని మొక్కలు అగ్నికి ఆహుతి..

దిశ,చివ్వేంల : గత కేసీఆర్ ప్రభుత్వం లో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎస్సారెస్పీ కాలువలకు సంబంధించిన భూములలో సంపద వనాల పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి మొక్కలు నాటింది. నాటిన మొక్కలకు పంచాయతీ సిబ్బంది నిరంతరం నీరందించడంతో ఏపుగా పెరిగి చెట్లుగా ఎదిగాయి.కాని సంపద వనం లోని మొక్కలు అగ్నికి ఆహుతి అయిన సంఘటన గురువారం చివ్వేంల సంపద వనంలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మండల కేంద్రంలో ఎస్సారెస్పీ కాలువ కు సంబంధించిన భూములలో సూర్య నాయక్ తండా కు వెళ్లే దారిలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సంపద వనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వేసవి కాలంలో చెట్లు ఎండిపోతుంటే దీనికి తోడు ఆకతాయిలు నిప్పు వేయడం తో గడ్డి ఎండిపోయి ఉండడం తో గడ్డితో పాటు మొక్కలు కూడా అగ్నికి ఆహుతి అయిపోయాయని తెలిపారు. నిన్నటి వరకు పచ్చదనంగా ఉన్న మొక్కలు అగ్నికి ఆహుతి కావడం తో బాటసారులు, వాహనదారులు కాలిపోయిన చెట్లను చూసి అయ్యో.. అంటూ చలించి పోతున్నారు.