- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వాట్.. రామ్ చరణ్‌కు ఇష్టమైన హీరోయిన్ ఆమెనా..? అస్సలు ఊహించి ఉండరుగా..

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’(Game Changer) మూవీతో మన ముందకు వచ్చాడు. కానీ ఈ చిత్రం అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ‘ఉప్పెన’(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వంలో ‘ఆర్ సి-16’(RC-16) మూవీలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇక ఈ రోజు చరణ్ బర్త్ డే కావడంతో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. నేడు చరణ్ బర్త్‌డే కావడంతో అతని పర్సనల్ విషయాలను తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన చరణ్.. తనకు ఇష్టమైన హీరోహీరోయిన్స్ ఎవరనే విషయాలను బయటపెట్టారు.
ఈ క్రమంలోనే తనకు ‘మగధీర’(Magadheera) సినిమా అంటే చాలా ఇష్టమని అన్నారు. ఆ తర్వాత ‘ఆరెంజ్’(Orange), ‘రంగస్థలం’(Rangasthalam) సినిమాలు కూడా ఇష్టమని అన్నారు. కానీ మగధీర మాత్రం తన ల్యాండ్ మార్క్ అన్నారు. ఇక తనకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడగ్గా.. సమంత(Samantha) అంటే ఇష్టమని అన్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) తన ఫేవరేట్ హీరో అని అన్నారు. కాగా గతంలో రామ్ చరణ్ చేసిన కామెంట్స్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read More..